ఎవరికీ తెలియని చోటుకి వెళ్లిపోతానంటున్న బిగ్ బి

Published : Aug 08, 2017, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఎవరికీ తెలియని చోటుకి వెళ్లిపోతానంటున్న బిగ్ బి

సారాంశం

అక్టోబర్ 11వ తేదీన అమితాబ్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 75వ పుట్టిన రోజు వేడుకలు  అట్టహాసంగా జరుపుకోనున్నట్లు మీడియాలో వార్తలు ప్రసారమౌతున్నాయి.

 

తమ అభిమాన నటుడి పుట్టినరోజు అనగానే.. అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు. కేకులు కోసి సంబరాలు జరుపుకుంటారు. పటాసులు కాలుస్తూ ఉత్సవాలు చేస్తారు. మరికొందరైతే ఏకంగా పాలాభిషేకాలే చేస్తారు. తమ కోసం అభిమానులు అలా చేయడాన్ని చాలా మంది కథానాయకులు ఆనందంగా ఫీలవుతారు.అయితే.. ఇవన్నీ తనకు నచ్చవని బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటున్నారు.  అంతేకాదు.. పుట్టిన రోజు వేడుకలు చేస్తే.. ఎవరికీ తెలియని చోటుకి వెళ్లిపోతానని కూడా చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..అక్టోబర్ 11వ తేదీన అమితాబ్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

దీంతో తమ అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకలు జరపాలని అభిమానులు ఆలోచించడం సర్వసాధారణం.ఈ నేపథ్యంలో ఆయన ..  తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. ఏవరైనా తన పుట్టిన రోజు వేడుకలు జరపదలిస్తే.. తాను ఎవరికీ తెలియని చోటుకు వెళ్లిపోతానని చెప్పారు. తన 75వ పుట్టిన రోజు వేడుకలు జరపాలని చాలా మంది  హడావిడి పడిపోతూ ఉండి ఉంటారు.. కానీ ఈ సారి మాత్రం ఇలాంటి వేడుకలు జరగడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటివి చేయాలని ఎవరికైనా ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోండి. అది స్నేహితులే కానీ, కుటుంబసభ్యులే గానీ.. మరెవరైనా సరే అని అమితాబ్ తెలిపారు.   అంతేకాదు.. తాను తన 75వ పుట్టిన రోజు వేడుకలు  అట్టహాసంగా జరుపుకోనున్నట్లు మీడియాలో వార్తలు ప్రసారమౌతున్నాయి.. అవి అవాస్తవమి బిగ్ బి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ‘102 నాటౌట్’,  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రాలలో నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !