(వీడియో) మీడియా కొంపముంచిందంటున్న పూరి జగన్నాథ్

Published : Jul 20, 2017, 08:16 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
(వీడియో) మీడియా కొంపముంచిందంటున్న పూరి జగన్నాథ్

సారాంశం

నాకు డ్రగ్స్ అలవాటు లేదు డ్రగ్ సప్లయర్ కెల్విన్ ఎవరో తెలియదు సిట్ కు సహకరిస్తా అయితే, నా జీవితం నాశనం చేసింది

 

 

దాదాపు పది గంటల సేపు సిట్ విచారణలో ఉన్న ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాథ్ మీడియా తన కొంప ముంచిందంటున్నారు. మీడియా కట్టుకథలు ప్రచారం చేసిందని,దీనితో భార్య, తల్లి, పిల్లలు నాలుగు రోజులుగా ఏడుస్తున్నారని అన్నారు.తాను ఎన్నడూ తప్పు చేయలేదని, తప్పుడు పనులు చేసే అలవాటు తనకు లేనే లేదని ఆయన అన్నారు. ‘నాపై వచ్చిన ఆరోపణలపై సిట్ నన్ను ప్రశ్నించింది. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చాను. నేను బాధ్యత గల వ్యక్తిని. చట్టవ్యతిరేకమైన, తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు.’ అని  పేర్కొన్నారు. విచారణ తర్వాత ఆయన మీడియాను తప్పించుకుని వెళ్లిపోయారు. ఇంటికెళ్లాక అర్థరాత్రి  ఆయన ఒక వీడియో  ప్రకటన ట్వీట్ చేశారు.  ఇది చూడండి.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !