ఎంపి కవిత లక్ష్యం కొద్ది గా నెరవేరింది

Published : Jul 19, 2017, 07:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
ఎంపి కవిత లక్ష్యం కొద్ది గా నెరవేరింది

సారాంశం

జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటుపై టిఆర్ ఎస్ ఎంపి  కవిత క్యాంపెయిన్ ప్రధాని మీద వత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి స్పందించి  ప్రధానికి ఉత్తరం రాసిని అస్సాం ముఖ్యమంత్రి  


 
జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు  కోసం ప్రయత్నిస్తున్న   నిజామాబాద్  ఎంపి కల్వకుంట్ల  కవిత ప్రయత్నానికి అసోం సిఎం సర్బానంద సోనోవాల్ తన మద్దతు తెలిపారు. పసుపు రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని సోనోవాల్ ఈ నెల 7వ తేదీన  ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కాఫీ, రబ్బర్, టీ, కాయిర్లకు ప్రత్యేకంగా బోర్డులు ఉన్నట్లే పసుపుకు సయితం బోర్డ్ ను  ఏర్పాటు చేయాలని కోరారు. అసోం లో 2015-16 లో 1,41, 441 టన్నుల అల్లం పంట దిగుబడి బాగా ఉందని, 16.184 టన్నుల పసుపు పండిందని  తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు తో పాటు అల్లం కు కూడా బోర్డు ఏర్పాటు చేయాలని సోనోవాల్ ప్రధాని కి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

పసుపు రైతు లను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏ ర్పాటు చేస్తూ, కనీస మద్ధతు ధరను ప్రకటించాలని ఎంపి కవిత ఇప్పటికే కేరళ మాజీ సిఎం ఊసెండి, ప్రస్తుత సీఎం విజయన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లను కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే. యి ప్పటికే రెండు సార్లు ప్రధాని మోడీ ని ,కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిశారు.   ఈ నెల 1వ తేదీన అసోం సిఎం సోనోవాల్ ను కలసి మద్దతు కోరారు. స్పందించిన సోనోవాల్ ఈ నెల 7న ప్రధాని మోడి కి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత సోనోవాల్ కు కృతజ్ఞతతలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu