శశికళ జైలు ‘మహారాణి’ వైభవం బంద్

Published : Jul 19, 2017, 07:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
శశికళ జైలు ‘మహారాణి’ వైభవం బంద్

సారాంశం

  శశికళకు వీఐపీ హోదా బంద్ జైళ్ల శాఖ నియమాలు కఠినతరం

 
 ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు అందిస్తున్న సౌకర్యాలకు మంగలం పాడింది పరప్పన అగ్రహార జైలు.  ఆమెకు జైలులోని   ఐదు గదుల్ని కేటాయించడం, వాటిల్లో సకల సదుపాయాలు కల్పించడంతో అదికాస్త బైటకుపొక్కి రచ్చ జరిగిన విశయం తెలిసిందే.  దీంతో అక్కడ జరుగుతున్న అవినీతిపై ఆగ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు నియమనిబందనల్ని కట్టుదిట్టంచేసారు

.
దీంతో శశికళ, ఆమె వదిన ఇళవరసి  సాధారణ ఖైదీల దుస్తుల్లోనే తమ గదిలో భంధీలుగా కాలం గడిపారు.  బోజనాన్ని కూడా మామూలు ఖైదీల మాదిరిగానే  పులిహోర, పెరుగన్నం, సాంబారు, సంగటి ముద్దనే  అందిచారు జైలు సిబ్బంది.  
 జైళ్ల శాఖలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకున్న  తర్వాత సంస్కరణలను  చేపడతామని   జైళ్ల శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మేఘరిక్‌ తెలిపారు.  ఇటీవలే నూతనంగా  బాధ్యతల్ని స్వీకరించిన ఆమె చట్టాన్ని ఉళ్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టనని వీఐపీ ఖైదీలనుద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !