శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి

Published : Dec 22, 2017, 05:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి

సారాంశం

హైదరాబాద్ పర్యటనకు రానున్న రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి నివాసంలో శీతాకాల విడిది ఏపీ రాజధాని అమరావతిలోనూ పర్యటించనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. ఈ నెల 24న ఉదయం చెన్నై నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. అదే రోజు రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం గర్నర్ నరసింహన్ రాజభవన్ లో నిర్వహించే విందుకు హాజరౌతారు

ఈనెల 26 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ఉంటారు. అనంతరం 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. రాష్ట్రపతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !