ఈ సంగారెడ్డి జర్నలిస్టులు ఏం చేశారో తెలుసా ?(వీడియో)

First Published Dec 22, 2017, 4:07 PM IST
Highlights
  • జహిరాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం 
  • ప్రయాణికులను కాపాడిన జర్నలిస్టులు

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద ఓ తుఫాన్ వాహనం భీభత్సం సృష్టించింది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఓ తుఫాన్ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన గుంతలో పడింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల తీవ్ర గాయాలపడ్డారు. మొత్తం ఏడుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలవగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ వాహనం బీదర్ నుండి హైదరాబాద్ కు వెళుతుండగా జహిరాబాద్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

అటుగా వెళ్తున్నజర్నలిస్ట్ లు ప్రసన్న కుమార్, విష్ణు లు దీన్ని గమనించి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. గాయపడ్డ ప్రయాణికులను వాహనంలోంచి బయటకు తీశారు. బాగా గాయపడ్డ వారికి వాహనం వద్దే ప్రథమచికిత్స చేసిన వీరు 108 కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో క్రియాశీలకంగా పని చేశారు. ప్రమాదంపై వెంటనే స్పందించి వారిని కాపాడిన జర్నలిస్ట్ లను స్థానికులు ప్రశంసించారు. సంగారెడ్డి జర్నలిస్టుల వీడియో కింద చూడండి

 

ఇది ఆరెంజ్ ట్రావెల్స్ అరాచకమేనట

అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డవారు హైదరాబాద్ కు చెందిన వారు. వీరంతా గోవా టూర్ కు వెళ్లి వస్తున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ వాహనంలతో గోవా నుంచి తిరిగి వస్తుండగా మద్యలో వారి బస్సు పాడయ్యింది. దీంతో ప్రత్యమ్నాయంగా మరో  బస్సును ఏర్పాటు చేయాల్సింది పోయి తుఫాన్ వాహనంలో కుక్కి కుక్కి కుసబెట్టి తరలిస్తున్నారు. వాహనంలో ఓవర్ లోడ్ కారణంగానే తుఫాన్ వాహనం అదుపుతప్పిందని భాదితులు చెప్పారు. ఆరెంజ్ ట్రావెల్స్ నిర్వాకం వల్లే తాము ప్రమాదానికి గురయ్యామని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

click me!