
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజీనామా తరువాత కేంద్ర ప్రభుత్వం కల్పించే సదుపాయాలు ఇలా ఉన్నాయి. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రూ 1,50,000 రూపాయలు నెల జీతంగా వచ్చేవి. రాజీనామా చేసిన అనంతరం అందులో సగం ప్రతి నెలకు 75,000 రూపాయల వస్తాయి. ఆఫీసు ఖర్చులకు మరో రూ 60,000 రూపాయలు. ఉచితంగా మోబైల్ బిల్లు, కారు చార్జీలు. ఆయన దేశంలో తిరగడానికి ఉచితంగా ఎయిర్ టికేట్లు, ట్రయిన్ సదుపాయాలు కల్పిస్తారు.
ప్రణబ్ ముఖర్జీ రాజీనామా నివాసం ఉండటానికి ఢిల్లీలో స్వర్గీయ మాజీ రాష్ట్రపతి డా. ఎపీజే అబ్దుల్ కలాం బంగ్లాను కేటాయించారు. ఇప్పటికే ఆ నివాసాన్ని సిద్దం చేస్తున్నారు. తన కుటుంబంతో ఆ బంగ్లాకు ప్రణబ్ ముఖర్జీ 27వ తేదిన మారనున్నారు.
నూతన రాష్ట్రపతి పదవి కోసం ఓటింగ్ పూర్తయింది. జూలై 20 వ తేదిన పూర్తి స్థాయిలో కౌంటింగ్ చేసి రాష్ట్రపతిని ప్రకటిస్తారు.ఎండిఎ అభ్యర్థి రామ్ నాథ్ కొవింద్ రాష్ట్రపతిగా దాదాపుగా ఎన్నికయినట్లె. ఎంత మోజార్టీతో గెలుపు అన్న దానిపైన సందిగ్థత కొనసాగుతుంది.