హైదరాబాద్ చాందినీ హత్య మిస్టరీ వీడినట్లే...

Published : Sep 13, 2017, 08:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
హైదరాబాద్ చాందినీ హత్య మిస్టరీ వీడినట్లే...

సారాంశం

ఆమె ఫోన్ లో  ‘మై హార్ట్’ అని సేవ్ అయిన నంబర్ చుట్టు పోలీసుల దర్యాప్తు సాగింది

అదృశ్యమయిన అమీన్ పూర్ గుట్టలలో శవమై కనిపించిన చాందినీ జైన్ హత్య మిస్టరీ దాదాపు వీడినట్లే. ఆమె క్లాస్ మేట్ సాయి కిరణ్ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఆధారాలు దొరికాయి.ఆమె మృత దేహం దొరికినప్పటినుంచి మియా పూర్ పోలీసులు ఈ 17 సంవత్సరాల అమ్మాయి హత్య మిస్టరీ ఛేదించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చాందినీ తిరిగిన ప్రాంతాలలోని దాదాపు 40 సీసీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ లో ఆమె తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్న విజువల్స్ రికార్డయ్యాయి. అమీన్ పూర్ దగ్గర ఇద్దరూ గుట్టల వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా విజువల్స్ లో ఉంది. పోస్టు మార్టమ్ రిపోర్టుతో పాటు సీసీ ఫుటేజ్ కూడా కేసు దర్యాప్తులో కీలకమయింది. ఆమె స్నేహితులందరిని ఆరా తీస్తున్నారు. ఆమెతో ఎవరో సన్నిహితంగా ఉండేవారో కనుకున్నారు. సన్నిహితంగా ఉన్న వ్యక్తే హత్య చేసుంటాడని పోలీసుల అనుమానం. చివరకు ఆమె కాల్ డేటా ఆధారంగా ఒక యువకుడి నంబర్ సంపాదించారు.  ఆమె ఫోన్ లో మై హార్ట్ అనే పేరుతో యువకుడి  నంబర్ ను సేవ్ అయి ఉంది.అందువల్ల మిస్టరీ వీడినట్లే నని పోలీసులుచెబుతున్నారు.

పోలీసులు చాందినీ డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్ లో పోస్టుమార్టమ్ చేశారు. పోస్టుమార్టమ్ తర్వాత కుటుంబసభ్యులు చాందినీ అంత్యక్రియలు చేశారు.

 

చాందినీ జైన్ హత్య గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ చదవండి

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !