
తెలుగుదేశం పార్టీ పండగ చేసుకునే అవకాశం వస్తున్నది.ఉరవకొండ వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి (ఫోటో) సోదరుడు మధుసూదన్ రెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరనున్నారు. ఆయనతో టిడిపి మంతనాలు విజయవంతమయిన వార్తలొస్తున్నాయి. అయితే, వైసిసి నేతలు కూడా మధుసూదన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. విశ్వేశ్వరెడ్డికి, మధుసూదన్ రెడ్డికి చాలా కాలంగా మాటల్లేవు.మధుసూదన్ రెడ్డి రాజకీయాలలో అంతచురుకైన పాత్ర ఎపుడు పోషించలేదు. అయితే, కుటుంబంలో ఉన్న అభిప్రాయ బేధాలను టిడిపి అనుకూలంగా మార్చుకుంటున్నది. ఈ విషయం లో విజయవంతమయిందనే చెబుతున్నారు. తొందర్లో టిడిపిలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా మధుసూదన్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. అయితే, జిల్లా స్థాయి వైసిపినాయకులు మధుసూదన్ రెడ్డితో ఒక ధఫామాట్లాడారు. ఈ చర్చలు విజయవంతమయినట్లు లేవు.
మధుసూదన్ రెడ్డి రాజకీయంగా విశ్వేశ్వర్రెడ్డి లాగా క్రియా శీలం కానప్పటికి ఆయన చేరిక తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా బాగా ఉపయోగపడుతుంది.ఉరవ కొండ ఎమ్మెల్యేకు కుటుంబం లోనే మద్దతు లేదని చెప్పుకోవచ్చు. రాయలసీమనుంచి పెద్ద ఎత్తున రెడ్లు టిడిపి వైపు వస్తున్నారని, టిడిపి ఎంతమాత్రం కమ్మ పార్టీ కాదని, రాయలసీమలో అన్ని స్థానాలు గెలుపొందుతామని టిడిపి నాయకత్వం ప్రచారం చేసుకునేందుకు ఇది బాగా పనికొస్తుంది.