మాయమైన చాందినీ జైన్ శవమై కనిపించింది

Published : Sep 12, 2017, 05:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మాయమైన చాందినీ జైన్ శవమై కనిపించింది

సారాంశం

కిశోర్ జైన్ ఇంటినిండా విషాదం. కనిపించకుండా పోయిన కూతురు చాందినీ జైన్ శవం అమీన్ పూర్ గుట్టల్లో తేలింది. అంతా మిస్టరి. మియాపూర్ పోలీసులు ఈ మిస్టరీని ఛేదించాల్సి ఉంది.

హైదరాబాద్ మియాపూర్ దీప్తి శ్రీ నగర్ లో ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ అదృశ్యం విషాదాంతంగా ముగిసింది.ఇంట్లో ఎవరికి చెప్పకుండా  వెళ్లిన విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతదేహం సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధి అమీన్ పూర్ గుట్టలో లభ్యమైంది. ఇంట్లో నుండి బయటకి వెళ్లిన చాందిని ఎవరితో వెళ్లింది.....? ఆమెను దారుణంగా హత్య చేయడానికి గలకారణాలేంటి...? అనేది ఇప్పుడు మిస్టిరిగా మారింది.  పోలీసులు హత్య కోణాన్ని చేధించే పనిలో ఉన్నారు. మాకు ముగ్గురు ఆడ పిల్లలలని ఎనాడు ఇబ్బంది పడలేదని, ఏ లోటు రాకుండా అందరిని బాగా చదివించికుంటున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంట్లో నుండి బయటికి వెళ్లిన చాందిని హత్యకు గురి కావడంతో ఆ కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.

మియాపూర్ దీప్తీ శ్రీనగర్ సత్యనారాయణ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నారు చాందినీ. తండ్రి కిషోర్  జైన్. బాచుపల్లి సిల్వర్ ఆక్రిడ్జ్ స్కూల్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ నెల 9 వతేదిన ఇంట్లో ఎవరితో చెప్పాపెట్టకుంటా  చాందిని బయటకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. స్నేహితుల వద్దకు వెళ్లింది అనుకున్నారు తల్లితండ్రులు. మరుసటి రోజు కూడ చాందిని రాలేదు.  ఆమె పోన్ కూడ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కుంటుంబ సభ్యులలో ఆందోళన మొదలయింది.  స్నేహితుల దగ్గిర  ఆరా తీశారు. కానీ వారి నుండి కూడ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో 10 వతేదిన చాంధిని అక్క నివేదిత జైన్ తన చెల్లి కనిపించడం లేదని మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేసింది.  పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.  చాందిని కోసం  రెండు బృందాలు గాలిస్తున్నాయి. ఇంతలో సంగారెడ్డి పోలీసుల నుండి అమీన్ పూర్ గుట్టలో మృతదేహం పడిఉందని, మిస్సింగ్ కేసుకు దగ్గర పోలీకలున్నాయని మియాపూర్ పోలీసులకు సమాచారం అందింది.  దీంతో మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చెరుకున్నారు. అంది చాందినీ మృతదేహమే. మృతదేహం పరిసరాల్లో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. చాందిన సెల్ పోన్, ఆమె బ్యాగ్   ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో నుండి కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకి వెళ్లిన చాందిని ...ఎవరితో వెళ్లింది అనేది ఇప్పుడు మిస్టరిగా మారింది. సెల్ పోన్లో చివరి పోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో వంచించి ఆమెపై ఆఘాహిత్యానికి పాల్పడి ...విషయం బయటకు పొక్క కుండా ఉండేందుకు హత్య చేశారా...ఇంకా ఎమైనా కారణాలు ఉన్నాయా తేలాల్సి ఉంది.

 చాందినీ మాయం కావడం కిడ్నాప్ కాదని పోలీసులంటున్నారు. ఆమె చాలా సన్నిహితులతో అమీన్ పూర్ గుట్టల దాాకావెళ్లిందని పోలీసుల అనుమానిస్తున్నారు. ఈకేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !