ఆదివారం ఉదయం పదిగంటలకు మోదీ క్యాబినెట్ విస్తరణ

Published : Sep 01, 2017, 03:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఆదివారం ఉదయం పదిగంటలకు మోదీ క్యాబినెట్ విస్తరణ

సారాంశం

ఆశోక్ గజపతిరాజు శాఖ మార్పు? సుజనాచౌదరి భవిష్యత్తు ప్రశ్నార్థకం బిజెపి విశాఖ ఎంపి హరిబాబుకు అవకాశం?

కేంద్ర మంత్రి మండలి పునర్య్వవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 3న (ఆదివారం) ఉదయం పదిగంటలకు మంత్రిమండలి విస్తరణ చేపట్టనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ చైనా వెళ్తున్నారు.

ఈ సారి మార్పులలో తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజును పౌరవిమానశాఖనుంచి తప్పించవచ్చని అనుకుంటున్నారు.  ఆంధ్రప్రదేశ్  నుంచి బిజెపి ఎంపి డాక్టర్ హరిబాబుకుక్యాబినెట్ లో చోటు దొరుకుతుందనుకుంటున్నారు. మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉపరా ష్టపతి అయినందున, రాష్ట్రానికి భరోసాఇచ్చేందుకు హరిబాబును తీసుకోవచ్చని అనుకుంటున్నారు. పోతే, చాలా ఆరోపణలు, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం మంత్రి సుజనాచౌదరికి ఉద్వాసనం ఉంటుందని కూడా తెలుస్తుంది.దాదాపు 12 మందిని మంత్రులను తొలగించనున్నారని సమాచారం. వీరిలో తెలంగాణాకు చెందిన కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు.

ఇప్పటికే మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ఎన్డీయేలో కొత్తగా చేరిన జెడియు నితిష్ వంటి మిత్రపక్షాలకు పదవులు ఇస్తారని తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణకు వీలుకల్పిస్తూ ఇప్పటికే కేంద్రమంత్రులు రాజీవ్‌ ప్రతాపరూడీ, ఉమాభారతి లతో కలసి ఐదుగురు గురువారం రాజీనామా సమర్పించినసంగతి తెలిసిందే. గత క్యాబినెట్ మార్పు 2016 జూలైలో జరిగింది. రాబోయేది 2019 వార్ క్యాబినెట్ అంటున్నారు. అందువల్ల అదనపు బాధ్యతులన్నవారి బరువు తగ్గిస్తారు. చెడుపేరు వచ్చిన శాఖాధిపతులను  మార్చేస్తున్నారని అనుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !