అయ్యో.. ఆ నాణేనికి ఎంత కష్టమొచ్చింది..!

First Published Sep 1, 2017, 1:55 PM IST
Highlights
  • ఈ నాణేలు భవిష్యత్తుల్లో కనిపించకవపోవచ్చు. ఇప్పటికే వీటి వాడకం పూర్తిగా తగ్గిపోయింది.
  • 2011 తర్వాత అసలు కనిపించడమే మానేసింది

 

చిల్లర నాణేలు అనేగానే.. దాదాపు చాలా మందికి రూ.1, 50 పైసలు, 25పైసలు గుర్తుకువస్తాయి. ప్రస్తుతం అడపా దడపా కనిపిస్తున్న ఈ నాణేలు భవిష్యత్తుల్లో కనిపించకవపోవచ్చు. ఇప్పటికే వీటి వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఒక వేళ మీ దగ్గర  నాణేలు ఉంటే.. వాటిని గుర్తుగా దాచుకోవాల్సిదేం తప్ప  వాడుకోవడానికి కుదరదు. ఎందుకంటే..  ఇక మీదట నాణేలు చెల్లడం లేదని ప్రచారం ఊపందుకుంది.

మొన్నటి వరకు అక్కడక్కడా.. 50 పైసల నాణేం ఇస్తే.. తీసుకునే వాళ్లు.. కానీ ఇప్పుడు తీసుకోవడం లేదు. ఇక 25 పైసల నాణేం అయితే.. 2011 తర్వాత అసలు కనిపించడమే మానేసింది. అప్పటి నుంచే దీని వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియానే తెలియజేసింది.

 

 బస్సుల్లో, దుకాణాల్లో.. ఈ నాణేలు ఇస్తే తీసుకోమని చెప్పేస్తున్నారని పలువురు తెలియజేశారు. దీంతో తమ వద్ద ఉన్న నాణేలు ఏమి చేయాలో తెలియక కొందరు బిక్షగాళ్లకు, అనాథలకు దానం చేస్తుండగా.. మరి కొందరు దేవుని హుండీల్లో వేస్తున్నారు.

కొందరు దుకాణదారులైతే ఈ విషయంలో కాస్త తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. వినియోగదారుడుకి 50పైసలు ఇవ్వాల్సి వస్తే.. నగదుకి బదులు.. చిన్న చాక్లెట్ ని అందజేస్తున్నారు. బస్సుల్లో ప్యాసింజర్లకు ఇస్తే తీసుకోకుండా వాదనకు దిగుతున్నారని.. అవి ఇంకా చెల్లుతున్నాయని చెప్పినా వినడం లేదని ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ వాపోయారు.

click me!