ఎర్నన్నాయుడి కొడుకు రామూకు ప్రధాని ఆశీస్సులు

Published : Jul 20, 2017, 08:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఎర్నన్నాయుడి కొడుకు రామూకు ప్రధాని ఆశీస్సులు

సారాంశం

ఢిల్లీలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు వివాహ విందు ప్రధాని మోదీ స్వయంగా హాజరయి ఆశీర్వదించారు వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా హాజరయ్యారు

 

శ్రీకాకుళం ఎంపి, కింజారపు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్‌నాయుడు దేశరాజధానిలో బుధవారం రాత్రి తన వివాహ విందు ఇచ్చారు. గత నెలలో ఆయన వివాహం విశాఖలో జరిగిన సంగతి తెలిసిందే. ఇపుడు ఢిల్లీలోని ఒక హోట్ లో జరిగిన రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హజరై రామ్మోహన్‌నాయుడు, శ్రావ్యలను ఆశీర్వదించారు. చాలా మంది ప్రముఖులు విందుకుహాజరయి నూతన దంపతులను ఆశీర్వదించారు. కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులతో కలిసివిందుకు వచ్చారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలతోపాటు ఇతర కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీప్రకాశ్‌జావడేకర్‌, సురేశ్‌ప్రభు, తోమర్‌, పీయూష్‌ గోయెల్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదేవిధంగా తెదేపా, తెరాస, వైకాపా, భాజపా, పలు పార్టీలకు చెందినవందలాది మంది ఎంపీలు విందుకు హాజరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !