రాష్ట్రపతి ఎన్నికలో చంద్రబాబు సాయం కోరిన ప్రధాని

First Published Jun 19, 2017, 2:59 PM IST
Highlights

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఎ తరఫున బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్టు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఫోన్  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు  తెలియజేశారు.  అంతేకాదు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీ మద్దతు కూడగట్టేపనిని కూడా  ప్రధాని చంద్రబాబుకు అప్పగించారట.

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్టీఏ తరఫున బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్టు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఫోన్  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు  తెలియజేశారు.  

సోమవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయం నుంచి పోలవరం ప్రాజెక్టు వర్చువల్ ఇన్‌స్పెక్టన్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి ఫోన్ వచ్చింది.ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తమకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వున్న చంద్రబాబును కోరారు. 

దేశంలో అత్యున్నత పదవికి సరైన అభ్యర్థిని ఎంపిక చేశారని ప్రధానిని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

ఉన్నత విలువలు కలిగిన మేధావి, దళితవర్గానికి చెందిన కోవింద్ భారత రాష్ట్రపతి పదవికి అన్నివిధాలుగా అర్హుడని  సీయం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

కోవింద్ అభ్యర్థిత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్టు సీయం చంద్రబాబునాయుడుప్రధానికి తెలిపారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్ధతు కూడగట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబును కోరారని ముఖ్యమంత్రి  కార్యాలయం తెలిపింది.

మమతాబెనర్జీ ప్రస్తుతం విదేశాల్లో వున్నందున ఇక్కడికి వచ్చాక సంప్రదిస్తానని  చంద్రబాబు తెలిపారట.

click me!