వచ్చే రాష్ట్రపతిగా దళితనేత : కోవింద్ పేరు చెప్పిన బిజెపి

First Published Jun 19, 2017, 2:11 PM IST
Highlights

దళిత నేత పేరును ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా  భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.ఇపుడు బీహార్ గవర్నర్ గా ఉన్న ఉత్తర ప్రదేశ్ బిజెపి దళితనే రామ్ నాథ్ కోవింద్ ను 2017 రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

దళిత నేతను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా  భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

ఇపుడు బీహార్ గవర్నర్ గా ఉన్న ఉత్తర ప్రదేశ్ బిజెపి దళితనే రామ్ నాథ్ కోవింద్ 2017 రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

ఆయన  బిజెపి దళితమో ర్చ అధ్యక్షుడిగా ఉన్నారు. కాన్పూర్ కు చెందిన కోవింద్ రెండు దఫాలు (1994-2006) రాజ్యసభ్యుడిగా ఉన్నారు.

1945 అక్టోబర్ 1 న ఆయన జన్మించారు.  భారతీయ జనతాపార్టీ జాతీయ అధికారప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 8న ఆయన బీహార్ గవర్నర్ నియమించారు.

దళిత అభ్యర్థిని నిలబెడితే  ఆయన పోటీ పెట్టడానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పడతాయి. దళిత వ్యతిరేకి అని ప్రతిపక్షాలకు  బిజెపి నుంచి విమర్శ ఎదురయ్యే అవకాశం ఉంది.

అందువల్ల బిజెపి వ్యూహాత్మకంగా రామ్ నాథ్ కోవింద్ పేరు ప్రతిపాదించారని అంటున్నారు.

2015లొో బీహార్ గవర్నర్ గా ఆయన నియమిస్తున్నపుడు కూడా ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ను సంప్రదించ లేదనే విమర్శ కూడా ఉంది.

 

 

click me!