క్రికెట్ ఓటమి దెబ్బ: ధోని ఇంటి కాడ 'వై' క్యాటగిరి భద్రత

First Published Jun 19, 2017, 1:33 PM IST
Highlights

ధోని ఇంటి కాడ  వై క్యాటగిరి  భద్రత ఏర్పాటు చేశారు. 2014లో భారత క్రికెట్‌ జట్టు ఓడిపోయిందని అల్లరి మూకలు ధోనీ నివాసం వద్ద వీరంగం సృష్టించారు. ఇది పునరావృతం కాకుండా జార్ఖండ్ లో ఈ భద్రత కల్పించారు.

 

 

పిచ్చి ముదిరితే ఇలా తయారవుతుంది.ఆటని ఆటగా చూల్లేదు చాలా మంది. దాన్ని దేశానికి మతానికి జోడించి చూడ్డం ఒక జాఢ్యం. నిన్నఇండియా పాక్ క్రికెట్ ను గొలుపు ఓటములు ఉండే ఆటగా చూల్లేదు.

 

ఇండియా వాళ్లు తప్పనిసరిగా గెలిచే వన్ సైడ్ ఆట అనుకున్న పిచ్చి వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్ వోడిపోవడం వీళ్లు సహించలేకపోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ చిత్తయిపోతుందని  ట్రోఫీని కైవసం చేసుకుంటుందని గోల గోల చేశారు. షాక్ తిన్నారు.  ఈ పిచ్చి అర్థం లేని ఆగ్రహంగా మారతున్నట్లు పోలీపులు కనిపెట్టారు. అహ్మదాబాద్ లో కొంతమంది టీవీలను రోడ్డు మీదకు తెచ్చి ధ్వంసం పిచ్చిప్రదర్శించారు.

 

టిమిండియా సభ్యులకు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోహ్లీ, యువరాజ్ సింగ్, అశ్విన్ ల పోస్టర్లను తగలబెట్టారు. ఇలాంటి వారి వల్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఝార్ఖండ్‌ ప్రభుత్వం భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఇంటి వద్ద  సెక్యూరిటీ  ఏర్పాటు చేసింది.

 

2014లో ఒకసారి ఇలాగే జరిగింది.  భారత క్రికెట్‌ జట్టు ఓడిపోయిందని అల్లరి మూకలు ధోనీ నివాసం వద్ద వీరంగం సృష్టించారు.

దానిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దోనికి వై కేటగిరి  భద్రత ఇచ్చారు.నిజానికి ఆయనకు జడ్ క్యాటగిరి భద్రత ఉండింది.2014 లో దీనిని వై క్యాటగిరికి కుదించారు.

click me!