ప్లేబాయ్ ఫౌండర్ ఇక లేరు

Published : Sep 28, 2017, 01:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ప్లేబాయ్ ఫౌండర్ ఇక లేరు

సారాంశం

1953లో తొలిసారిగా ప్లేబాయ్ ను ప్రారంభించారు మొదట క్యాలెండర్ గా విడుదల చేసి.. కాలక్రమేనా మ్యాగ్జైన్ గా మార్చారు.

ప్రముఖ మ్యాగ్జైన్ ‘ ప్లే బాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెన్ఫర్ (91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం  మృతిచెందారు.  ఈ విషయాన్ని ప్లేబాయ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

కాపీ రైటర్ గా తన కెరిర్ ను ప్రారంభించిన హ్యూ హెన్ఫర్.. 1953లో తొలిసారిగా ప్లేబాయ్ ను ప్రారంభించారు. ప్రత్యేకంగా మగవారి కోసం ప్రారంభించిన ఈ ప్లే బాయ్ ని.. మొదట క్యాలెండర్ గా విడుదల చేశారు. దీనికి విశేష స్పందన లభించింది. కాలక్రమేనా  క్యాలెండర్ కాస్తా మ్యాగ్జైన్  గా  రూపాంతరం చెందింది. ఈ మ్యాగ్జైన్ తొలి ప్రచురణలో అలనాటి అందాల తార మార్లిన్ మన్రో చిత్రాన్ని ప్రచురించారు. అత్యంత ఎక్కువ మంది అభిమానులు ఉన్న మ్యాగ్జైన్ ఇదే అని కూడా చెప్పవచ్చు.

అలాంటి సంచిక ఏడాదిన్నర క్రితం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నగ్న చిత్రాలను ప్రచురించబోమని సంచలన ప్రకటన చేసింది. అయితే, ఏడాది గడవకముందే ప్లే బాయ్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అనంతరం తిరిగి నగ్న చిత్రాలతో ప్లేబాయ్ ని తీసుకొచ్చేసింది. హ్యూ హెన్ఫర్ కి  భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !