
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై గురువారం నాడు భారీ సంఖ్యలో మహిళలచే బతుకమ్మ పండుగ నిర్వహణకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎల్బీస్టేడియం నుండి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే బతుకమ్మ శోభయాత్ర రహదారితో పాటు బతుకమ్మలను నిమజ్జనంచేసే బతుకమ్మఘాట్‌లో ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది.బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్‌ల ఏర్పాటు, రోడ్ల మరమ్ముతులు, పరిసరాల పరిశుభ్రతను జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టారు.ఈ బతుకమ్మ కార్యక్రమంలో 3,500మంది మహిళలను జీహెచ్ఎంసీ ద్వారా హాజరుకానున్నారు. వీరితో పాటు మరో 3వేల మందికిపైగా మహిళలు హాజరుకానున్నారు.నేటి కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ఎల్బీస్టేడియానికి మహిళలు చేరుకొని బతుకమ్మలను పేర్చారు. ఎల్బీస్టేడియం నుండి ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా వచ్చి బతుకమ్మ ఆడుతారు.బతుకమ్మల నిమజ్జనానికి బతుకమ్మ ఘాట్ లో విస్తృత యేర్పాట్లు చేపట్టారు.ఈ కార్యక్రమ నిర్వహణకు పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు జీహెచ్ఎంసీ పలు ఏర్పాట్లు చేపట్టింది. బ తుకమ్మ ఘాట్ లో 30అడుగుల బతుకమ్మ నిలబెట్టారు. నిమాజ్జనాలకు మంచి నీటితో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.