ఆ నాలుగు రోజులు బ్యాంకులు తెరుచుకోవు..

First Published Aug 11, 2017, 2:15 PM IST
Highlights
  • సెలవలు వరసగా రావడంతో నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు
  • ఖాతాదారులు ముందస్తుగా బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు..

 

వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. సెలవలు వరసగా రావడంతో నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని  సంబంధిత అధికారులు చెప్పారు. ఈ నెల 12వ తేదీన రెండో శనివారం,  13వ తేదీ ఆదివారం, 14వ తేదీ కృష్ణాష్టమి, 14వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం వచ్చాయి. కృష్ణాష్టమి జాతీయ సెలవు దినం కాగా ఆరోజు బ్యాంకులు పనిచేయవు. స్వాత్రంత్య దినోత్సవం రోజున బ్యాంకు ఉద్యోగులు పంద్రాగస్టు వేడుకల్లో పాల్లొని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతారు. దీంతో వరసగా 4 రోజుల పాటు సెలవలు వచ్చాయి. దీంతో పలువురు ఖాతాదారులు ముందస్తుగా బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు..

click me!