రూ.80దాటిన లీటర్ పెట్రోల్ ధర

First Published Feb 5, 2018, 4:38 PM IST
Highlights
  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్రోల్, డీజిల్ వడ్డన భారీగానే జరుగుతోంది. కాగా.. సోమవారం లీటరు పెట్రోల్‌ ధర 15 పైసలు, లీటరు డీజిల్‌ ధర 7 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో మరోసారి రూ.80 మార్కును పెట్రోల్‌ ధర అధిగమించి, రూ.81.17గా నమోదవుతోంది. డీజిల్‌ రూ.68.30గా ఉంది. ఇక ఢిల్లీలో 2014 మార్చి నుంచి అత్యంత గరిష్ట స్థాయిల్లోకి పెట్రోల్‌ ధర ఎగిసింది. లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.73.31గా, డీజిల్‌ ధర రూ.64.14గా రికార్డయ్యాయి.

గతేడాది డిసెంబర్‌ మధ్య నుంచి లీటరు పెట్రోల్‌ ధర కనీసం రూ.4, డీజిల్‌ ధర రూ.5.77 మేర పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో వీటిపై రెండు రూపాయల ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించారు. కానీ స్థానిక పన్నుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు రూపాయల మేర ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 8 రూపాయల రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విధిస్తున్నట్టు తెలిపింది.

click me!