చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అభిప్రాయం ఇది

Published : Feb 13, 2017, 09:23 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అభిప్రాయం ఇది

సారాంశం

బాలయ్య ఎన్టీఆర్ సినిమాను ఎన్నికోణాలలో తీసిన ముఖ్యమయిన కోణాలన్నీ మాయమవుతాయని చెబుతున్నారు  దగ్గుబాటి

 

 బాలయ్య ‘అన్ని కోణాలుంటాయి’ అని చెబుతున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో  చాలా కోణాలుండేకి వీలు లేదని సర్వత్రా వినపడుతూ ఉన్న నేపథ్యం ఎన్టీఆర్ పరివారంలో ఒక ముఖ్యమయిన వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసా... ‘ఎన్టీఆర్ సినిమా  అసంపూర్ణంగా మిగిలిపోతుంది’ అని.  ఈ సినిమా తీయడం చాలా కష్టం, ఎందుకంటే, ఆయన జీవితంలోని అన్నిఅంశాలను చూపించాలి,  అసలు సినిమా తీస్తారా అనే అనుమానం కూడా ఆయన వ్యక్తం చేశారు.

 

నందమూరి బాలకృష్ణ తీయబోతున్న ఈ  సినిమా   ఎన్టీరామారావుకు తీరని ద్రోహంచేస్తుందని,  అది చంద్రబాబు కడిగిన ముత్యంలాగా అపకీర్తి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని చాలామందికి అనుమానం ఉంది.

 

ఇదే అనుమానం ఎన్టీరామారావు పెద్దల్లుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వేంకటేశ్వరరావులో కూడా ఉంది.

 

ఎన్టీఆర్ జీవితాన్ని ఉన్నదున్నట్లు చూపితే, చంద్రబాబు బాగా చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక టివి కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎన్టీఆర్ కు చంద్రబాబు మీద చాలా కోపం ఉందని, దానిని పలుమార్లు వ్యక్తం చేశాడని ఆయన ఒక వీడియోను కూడా చూపించారు. ఎన్టీఆర్ను పదవి నుంచిదించడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు వెల్లడిస్తూ ఇందులో  హరికృష్ణ, బాలకృష్ణ కూడా పాలు పంచుకున్నారని అయన అన్నారు.

 

చంద్రబాబు పోషించిన ఇలాంటి వివాదాస్పద పాత్రను సినిమాలో చూపించడానికి సాధ్యం కాదు, దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోరని కూడా ఎన్టీఆర్ పెద్దల్లుడు చెప్పారు. చంద్రబాబు మీద ఎన్టీఆర్ కు ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పే వీడియోని ఆయన ప్లే చేశారు. అందులో ఉన్న విషయం ఇది.” నా రక్తం పంచుకుని పుట్టిన నా కూతురిని ఇచ్చి పెళ్లి చేశాను. తండ్రి లాంటి వాడినయిన నన్ను ఏ విధంగా మోసం  చేశాడో ఒక్క సారి గమనించండని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్లలో చైతన్యంఉందేమోనని పరీక్షించాం.‘ మేం మనుషులం కాదు, పశువులం. నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తాం. గొంతు కోస్తాం.,’ అని  నిరూపించుకున్న ఘాతకుడు వాడు.  చరిత్ర మరువదు.”

 

చంద్రబాబు నాయుడంటే ఎన్టీఆర్ కు ఎలాంటి అభిప్రాయముందో ఈ వీడియో చెబుతుందని అంటూ దీనిని బాలయ్య సినిమాలో చూపించాలని ఆయన సలహాఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu