పవన్ కల్యాణ్.. పాచిపోయిన ట్వీట్

Published : Nov 20, 2016, 10:27 AM ISTUpdated : Mar 24, 2018, 12:12 PM IST
పవన్ కల్యాణ్.. పాచిపోయిన ట్వీట్

సారాంశం

పెద్ద నోట్ల రద్దుపై 10 రోజుల తర్వాత స్పందన ప్రజలు ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్య

పెద్ద నోట్లు రద్దయి దేశమంతా గగ్గోలు పెడుతోంది.. 10 రోజులు దాటినా సామాన్యుల కష్టాలు తీరడం లేదు.. ఈ విషయం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కాస్త ఆలస్యంగా అర్థమైనట్లు ఉంది. సండే కాస్త తీరిక చేసుకొని పాచిపోయిన ట్వీట్ ఒకటి వదిలారు.

నోట్ల రద్దు వల్ల వృద్దులు, గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్విటర్ల లో ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త కరెన్సీ ఎంతమేర అందుబాటులో ఉందో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.

ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ముందుకెళ్లినట్లు అనిపిస్తోందన్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu