అమ్మో! ఒకటో తారీఖొస్తా ఉంది

Published : Nov 20, 2016, 03:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
అమ్మో! ఒకటో తారీఖొస్తా ఉంది

సారాంశం

ఇపుడు ఆర్థిక మాంద్యం లేదు, యుద్ధ వాతావరణం లేదు. కరువు కాటకాల్లేవు. దానికి తోడుఅందరి  అకౌంట్లలో దండిగా కాకపోయిన, బతుకుదెరువుకు సరిపోయే జమలు ఉన్నాయి. అయినా, పైసల కోసం కటకటలాడాల్సిన ఒకటో తేదీ వస్తాంది.

ఒకటో తారీఖొస్తాంది.

డబ్బు కోసం వెన్నులో చలి పుట్టించే రోజొస్తా ఉంది.

 

పది రోజుల ముందు నుంచే లక్షలాది మంది గుండెల్లో గుబులు మొదలయింది 

ఉద్యోగం లేకుండా బతికిన రోజులుండవచ్చు.  ఉద్యోగమున్నా సకాలంలో జీతాలురాని జీవితాలు గడిపి ఉండవచ్చు.

ఉద్యోగం ఉండి, జీతమూ అందుతూ ఉండి, అది బ్యాంకులతో దర్జగా జమ అయినా, చేతికందని రోజు రాబోతున్నది.

అయితే ఈ  డిసెంబర్ ఒకటో తారీఖున ఈ కొత్త పరిస్థితి ఉద్యోగులందరికీ ఎదురవ బోతున్నది.

 ఇప్పటి  బ్యాంక్ విత్ డ్రావల్ నియమాలు ఇలా కొనసాగితే,  తొలిసారి  అకౌంటున్న ప్రతి ఉద్యోగి జీతం రాళ్లూ పూర్తిగా డ్రాచేసుకోలేని పరిస్థితి వస్తున్నది.

 

ఒకటో తేదీ అంటే  సవా లక్ష అవసరాలు నోర్లు తెరిచి నిలబడతాయి. ఇంటి అద్దె, కిరాణ షాపు, పాల బిల్లు, న్యూప్ పేపర్ బిల్లు, పనోళ్ల జీతం, స్కూళ్ల ఫీజులు, దోబీ బిల్లు.. ప్రతి ఉద్యోగికి ఆన్ లైన్ లో చెల్లించలేని పైకాలే ఎక్కువ గా ఉంటాయి. బ్యాంకు వాళ్లు విధించిన పరిమితులతో  జీతమంతా డ్రా చేసుకోవడమెలా?

 

 ఈ ప్రశ్న వేలాది మంది పీడిస్తూ ఉంది.  గతంలో ఎపుడూ, యుద్ధ సమయాలలో కూడ ఇలాంటి పరిస్థితి రాలేదు. 2008 తర్వాత  ప్రపంచ వ్యాపితంగా మాంద్యం వచ్చి చాలా కంపెనీలు జీతాలో లో కోత విధించినా  నెలాఖరుకో, మొదటివారంలో జీతం పూర్తిగా బ్యాంకులో పడేది, డ్రాచేసుకునేందుకు స్వేచ్ఛ ఉండేది.

 

ఇపుడు ఆర్థిక మాంద్యం లేదు, యుద్ధ వాతావరణం లేదు. కరువు కాటకాల్లేవు. దానికి తోదు అందరి  అకౌంట్లలో దండిగా కాకపోయిన, బతుకుదెరువుకు సరిపోయే జమలు ఉన్నాయి. అయినా, పైసల కోసం కటకటలాడాల్సిన ఒకటో తేదీ వస్తాంది.

 

రు. 24 వేలను రెండు మూడు దఫాలుగా డ్రా చేసుకునేందుకు వీలున్నా,  రెండు మూడుసార్లు బ్యాంకులకు వెళ్లి క్యూలలో నిలబడుకోవడం ఉద్యోగులకు సాధ్యమా?  ఈ మొత్తం పట్టణాల్లో చాలా కుటుంబాలకు చాలదు.  మరి అదనపు నిధుల సంగతేమిటి? నలభై నుంచి యాభై వేల డ్రా చేసుకోవాలనుకునేవారికి మార్గమేమిటి అని చాలా మంది అడుగుతున్నారు.

 

ఎటిఎం ల దగ్గిర గంటల తరబడి నిలబడితే రాలేవి రెండు వేలే. ఈ రెండు వేల నోటుని చిల్లర ఖర్చుల కోసం మార్చడమెలా అనేది మరొక ప్రశ్న.

మొత్తం రొక్కమంతా చేతికొస్తే నెలగడవనపుడు ,ఇన్ స్టాల్మెంట్ల మీద బండి లాగించడమెలా అనే దిగులు సర్వత్రా కనిపిస్తావుంది.

ఏదయినా సర్జికల్ స్ట్రయిక్ చేసి ప్రధాని మోదీ నగదు సమస్యనేది లేకుండా చేస్తాడా.

అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాయేదయినా  చేసి డబ్బులు ప్రతి ఇంటికీ హోమ్ డెలివరీ చేస్తారా

ఇంకా  పదిరోజుల టైం ఉంది కదా చూద్దాం, అని ఓపిక  పట్టడమొకటే మార్గం ఇప్పటికయితే...

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !