ప్రపంచం ఇలా కోడై కూస్తా ఉంది

First Published Nov 20, 2016, 6:21 AM IST
Highlights

భారత దేశంలో  అకస్మాత్తుగా ఎదురయిన నోట్ల విపత్తు గురించి ప్రపంచ పత్రికలేమంటున్నాయి?

భారతదేశం యావత్తు నగదు లేక విలవిల్లాడడం గురించి ప్రపంచంలో పేరుమోసిన పత్రికలు ఇలా రాశాయి.

 

బ్యాంకుల దగ్గిర నోట్ల కోసం పడిగాపులు కాయడం, ఓపిక నశించి సంయమనం కోల్పోవడంతో  దేశ రాజధాని ఢిల్లీలో చాలా చోట్ల గలాటాలు జరిగాయి.  శుక్రవారం నాడు ఢిల్లీ పోలీసులకు ఇలాంటి గొడవలకు సంబంధించి మూడు వేల కాల్స్ అందాయి. శనివారం నాడు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. శనివారం ఉదయం మొదటి రెండు గంటలలోనే దాదాపు 200 కాల్స్ వచ్చాయి.

 

నగదు కోసం జనం బారులు చాంతాడులా పెరిగిపోతున్నాయి.  ప్రభుత్వం ఎన్ని హామీ లిచ్చినా బ్యాంకుల ఎటిఎంలు  నగదు నింపారో లేదో... వెంటనే  ఖాళీ అవుతున్నాయి. నగదు విత్ డ్రా మీద పరిమితులు విధించినా ప్రయోజనం కనిపించడంలేదు. అక్కడక్కడ ఆగ్రహించిన జనం పాతనోట్లను గోనెసంచుల్లో తీసుకొచ్చి కాల్చేస్తున్నారు. శవదహనాలలకు, రోగులును ఆసుపత్రులలో చేర్పించేందుకు  కూడా ప్రజల దగ్గిర డబ్బులు లేవు. ఎక్కడకు వెళ్లినా, పార్కుల్లో కావచ్కు, మార్కట్లో కావచ్చు, ఒకటే తిట్లూ, ’మా డబ్బునుమేం తీసుకోవడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది,’ అని.

 

నోట్ల రద్దు దుష్ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ కష్టాలిప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. చచ్చుగా అమలు చేయడంతో మోడీ మహాపథకంలోని లొసుగులు పరిస్థితిని విషమింప చేశాయి. కొత్త నోట్లు తగినన్ని లేకపోవడం తో ఎటిఎంలన్నీ ఖాళీ అయిపోయాయి. ఉన్న నగదును సర్దు బాటు చేసేందుకు బ్యాంకులు వోవర్ టైం పనిచేయాల్సి వస్తున్నది.  గంటల తరబడి క్యూలో నిలబడినా చేతి కొచ్చే నగదు పిసిరంత. అవసరాలకది ఏమాత్రం చాలక ప్రజలు నానా ఇబ్బందులు పడ్తున్నారు.

  • ది గార్డియన్ (https://goo.gl/KysBfF)

 

 

జేబు నిండా నోట్లున్నా, చాలా చోట్ల ప్రజలు డబ్బుల చెల్లించలేని పరిస్థితి ఉంది. నూరు రుపాయల నోట్లలో డబ్బుల చెల్లించలేకపోవడంతో ఆసుపత్రులలో రోగులను చేర్చుకోవడం లేదు.  అంబులెన్సులు రావడంలేదు.  రోగులు చనిపోతున్న సంఘటనలు దేశమంతా జరుగుతున్నాయి. మణిపూర్ లో ఒక పిల్లవాడిని  చేర్చుకొనకపోవడం తల్లితండ్రులు ఇంటికి తిరిగొచ్చారు. తీవ్ర జ్వరంతో కొద్దిసేపట్లొనే ఆ బాలుడు చనిపోయాడు. తండ్రి దగ్గిర  ఆసుప్రతి ఫీజుకు దగ్గ డబ్బుంది. అయితే, అదంతా చెల్లని అయిదొందల నోట్లే.

 

భారతావనిలో ప్రజల కోపం తారాస్థాయికి చేరుకుంటూఉంది. బిలియన్లలో ఉన్న దొంగనోట్లను రూపుమాపే పేరుతో ప్రభుత్వం ఉన్నట్లుండి  పెద్ద నోట్లను రద్దు చేయడంతో  నోట్ల మార్పిడి  రద్దీని తట్టుకోలేక బ్యాంకులు నానాయాతన పడుతున్నాయి.

 

సెక్యూరిటీ గార్డులు గేట్లు మూసేయడంతో , కోపోద్రిక్తులయిన కస్టమర్లు  ఢిల్లీలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు అద్దాలమీద మోదడం కనిపించింది. శుక్రవారం నాటిటి దేశంలో ఉన్న 2.2 లక్షల ఎటిఎం లలో సగం పనిచేయడంలేదు. పని చేసే వాటిలో గంటల్లో నగదు ఖాలీ అయింది.

 

 

 

దేశమంతా బ్యాంకు కస్టమర్లు బ్యాంకులకు పరుగు తీసున్నారు. చిల్లర డబ్బులు తీసుకోవడానికి పెద్ద పెద్ద క్యూలలో చాలా సేపు – గంటల తరబడి నిలబడుతున్నారు. పెట్రోలు పంపుల వద్ద చిల్లర లేకపోవడం పెనుగులాటలకు దారి తీస్తావుంది.

  • వాషింగ్టన్ పోస్ట్ (https://goo.gl/cecIYL)

 

 

 

 

 

click me!