బిజెపితో పవన్ కటీఫా...

Published : Dec 15, 2016, 12:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
బిజెపితో పవన్ కటీఫా...

సారాంశం

 ఉన్నట్లుండి  అవేశపడటం జన సేనాని విశేషం. ఇపుడాయన బిజెపి మీద ఆవేశపడుతున్నారు. ఇది నిజామా లేక భ్రమయా;

ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడు,  2014 ఎన్నికలలో ఆయన విజయానికి చేయూత నిచ్చిన జన సేనాని, తెలుగు హీరో పవన్ కల్యాణ్ బిజెపి తాట వొలుస్తానంటున్నాడు. మీ సంగతేందో రోజూ కడిగేస్తానంటున్నాడు. ఆయన  ఇపుడ బిజెపి, టిడిపి నుంచి దూరంగా జరిగి తన దారేదో వెతుక్కుంటున్నట్టేనా?  తాజాగా పవన్ అవేశం ఎలా ఉందో చూడండి.

 

నోట్ల  సంక్షోభంలో  ఉన్న బిజెపికి చికాకు తెప్పిస్తూ ఈ రోజు ట్విట్వరెక్కి  బిజెపి గో సంరక్షణ  , బీఫ్  విధానాన్ని తూర్పార పట్టారు. బిజెపికి అతంత్య ప్రియమయిన గో విధానాన్ని విమర్శించడం తీవ్రమయిన విషయమయినా  సరే, ఆయన గో వధ, బీఫ్   మీద బిజెపి పార్టీ అనుసరిస్తున్న విధానం మీద ఒక స్పష్టమయిన స్టాండ్ తీసుకున్నారు. అంటే, బిజెపికి ఆయన కటీఫ్ చెప్పినట్లే లెక్క.

 

‘ గో సంరక్షణ,గో మాంసం మీద  బిజెపిది విచ్ఛిన్నకర విధానం.  బీఫ్ తినే వర్గాల్లో భీతి కల్గించి, వారికి,  గోవును పూజించే వారికి మధ్య వైష మ్యాలను సృష్టించేందుకు ఉద్దేశించినది.’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

‘మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీ పార్టీ అధికారంలో ఉన్న గోవాలో బీఫ్ ను నిషేధించి వుండేవారు,’ అని కూడా అన్న ముల్గుగర్రతో గుచ్చారు.

 

‘అదే నిజాయితీ ఉంటే, బిజెపి కార్యకర్తులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు,  తోలు బెల్టులు,  బూట్లు వాడకుండా నిషేధం విధించి వుండేవారు. గోమాతను పరిరక్షించాలనే చిత్తశుద్ధి ఉంటే, బిజెపికి చెందిన ప్రతికార్యకర్త ఒక గోవాను దత్తత తీసుకునేలా చేసి ఉండాలి. ఇలాంటిచర్య లు తీసుకుని ఉంటే, గోహత్యను నిషేధించేందుకు  మీరు అనుసరిస్తున్న విధానాలకు మరింత బలం చేకూరి ఉండది,’ అని పవన్ అన్నారు.

 అంతేకాదు, రేపు హైదరాబాద్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత్ రీసెర్చ్ స్కాలర్ రోహిత మీద స్పందిస్తాననిపవన్ హెచ్చరించారు. 

 

2014 లో వపన్ బిజెపి- తెలుగుదేశం పార్టీ ల తరఫున ప్రచారం చేశారు. వారిని గెలిపించేందుకు తన పార్టీ తరఫున ఎవరినీ పోటీకి కూడా పెట్టలేదు. ఇపుడాయన  తెలుగుదేశం నుంచి , బిజెపి నుంచి దూరంగా జరుగుతున్నారు.  అంటే, పొలికేక వేస్తున్నట్టే లెక్క.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !