నేతాశ్రీలు.. బూతు సిత్రాలు

Published : Dec 15, 2016, 11:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నేతాశ్రీలు.. బూతు సిత్రాలు

సారాంశం

కర్నాటకలో నేతల  చిలిపి చేష్టలకు అడ్డే లేకుండా పోతోంది. అసెంబ్లీ అయినా సచివాలయమైన తమ చిలిపి పనులతో శారీరక సేవలో తరిస్తున్నారు.  

కర్నాటకలో నేతల  చిలిపి చేష్టలకు అడ్డే లేకుండా పోతోంది. అసెంబ్లీ అయినా సచివాలయమైన తమ చిలిపి పనులతో శారీరకసేవలో తరిస్తున్నారు.

 

రాజకీయ నేతలకు తామేమీ తక్కువ తినలేదని ప్రవచనాలతో జనాలకు హితోక్తులు భోదించే బాబాలు కూడా తమ రాసలీలలతో తన్మయత్వం చెందుతున్నారు.

 

 

నిత్యానంద- రంజిత : 

 

వీళ్ల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. భక్తిలో శృంగార రసాన్ని మేళవించి టీవీలకు విపరీతంగా రేటింగ్ పెంచే పనిచేశారు.

 

2010 లో విడుదలైన వీరి సీడీలు యూ ట్యూబ్ లో లక్షల హిట్లు దాటాయి. నిత్యానంద వ్యక్తిగత డ్రైవరే ఈ బాగోతాన్ని వీడియో తీసి బయటపెట్టిన విషయం తెలిసిందే.

 

ఈ వీడియో మూలంగా ఆయన ఇమేజీ దారుణంగా డ్యామేజీ అయింది. ఇప్పటికీ దీనిపై కోర్టు గడప తొక్కాల్సివస్తుంది బాబా గారికి.

 

 

బీజేపీ నేత రేణుకాచార్య : 

 

కర్నాటకలోని విక్టోరియా ఆస్పత్రిలో పనిచేసే జయలక్ష్మి అనే నర్స్ 2009 లో ఈయన బాగోతాన్ని బయటపెట్టింది.

 

బీజేపీ మాజీ ఎమ్మెల్యే రేణుకాచార్య తనను లైంగికంగా వేధించారని ఆరోపించింది. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలను కూడా బయటపెట్టింది.

 

 

హలప్ప కుంభకోణం : 

 

బీజేపీ నేత, కర్నాటక మంత్రిగా పనిచేసిన హలప్ప కూడా 2012లో ఒక సెక్స్ స్కాండిల్ లో ఇరుక్కున్నారు.

 

యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనగారు తన భార్య స్నేహితురాలతో జరిపిన రాసలీలలు మీడియాకు ఎక్కాయి.

 

హలప్ప తన పదవికి రాజీనామా చేయడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

 

ఎక్సైజ్ మంత్రి హైచ్‌వై మేతీ :  

 

 

 

 

 

 

 

 

 

 

 

తాజాగా  సిద్దిరామయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హైచ్‌వై మేతీ కూడా ఓ మహిళలతో సచివాలయంలోనే రాసలీలలు సాగిస్తూ దొరికిపోయారు. ఆయన మాజీ గన్ మెన్ ఈ వీడియోను బయటపెట్టినట్లు తెలుస్తోంది.

 

దీనిపై ప్రతిపక్షాలు పెద్దయెత్తున్న ఆందోళన చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

 

 

ఇక 2012 లో కర్నాటక మంత్రి లక్ష్మణ్ సవధి కూడా అసెంబ్లీ సాక్షిగా నీలిచిత్రాలు చూస్తూ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. ఆయనతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇలానే చేశారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu