
అయ్యప్ప మాల దీక్ష సౌత్ ఇండియా లో అత్యధికమంది ఆచరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో అయ్యప్పమాలదారులుంటారు.
నల్లటి వస్త్రాలు ధరించి నిష్ఠగా 41 రోజులు ఉండటం అయ్యప్ప దీక్షలో ముఖ్యమైన నిబంధన. దేశమంతా ఈ ఆచారం పాటిస్తన్నదే.
అయితే కర్నాటకలోని ధర్వాడ్ జిల్లాలోని కలఘతాగి తాలుకాలో మాత్రం అయ్యప్పమాల వేసుకునేవారు మాత్రం కాస్త ప్రత్యేకం.
నాగా సాధువులులాగా ఇక్కడ అయ్యప్ప స్వాములు నగ్నంగా పూజాదికాలు నిర్వహిస్తారు. 41 రోజుల్లో చివరి 15 రోజులు నల్లటి వస్త్రాలు ధరించకుండా నగ్నంగానే ఉంటారు.
ఆ 15 రోజులు గ్రామంలో ఉండే మహిళలందరూ వేరే ఊరుకు వెళ్లిపోవాల్సిందే. ఇది తమ ఊరులో మాత్రమే పాటిస్తున్న నియమం అని స్థానికులు చెబుతున్నారు.