
రాయలసీమలో మలివిడత జనసేన ఔత్సాహికుల ఎంపిక శిబిరాలు మళ్లీ జరగనున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఈ శిబిరాలకు కర్నూలు, తిరుపతి, కడప జిల్లాలు వేదిక కానున్నాయి.
కర్నూల్, కడప, అనంతపురం జిల్లాలు మూడు కలిపి ఇప్పటి వరకు ఆన్ లైన్ లో 5500 అప్లికేషన్లు అందాయని, ఇక ఆన్ లైన్ లో అప్లై చేయాలనుకునేవారికి మంగళ వారంతో గడువు ముగుస్తుందని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చేయలేక పోయిన వారు నేరుగా శిబిరాలకు హాజరై తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.