రు. 2000 కోట్ల కలెక్షన్ దాటిన ‘దంగల్’

Published : Jun 27, 2017, 02:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
రు. 2000 కోట్ల కలెక్షన్ దాటిన ‘దంగల్’

సారాంశం

‘దంగల్’ ఆమీర్ ఖాన్  ను అందలమెక్కించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా రిపోర్టు  ప్రకారం ‘దంగల్ ’ కలెక్షన్ రు. 2000 కోట్లు దాటింది. భారతీయ సినిమా చరిత్రలో ఈ స్థాయికి చేరుకున్న చిత్రం లేదు. చైనాబాక్సాఫీస్ వద్ద  కొనసాగుతున్న కలెక్షన్ వెల్లువ దంగల్ ని  2000 కోట్ల క్లబ్ లోకి చేర్చింది.

‘దంగల్’ ఆమీర్ ఖాన్ అందలమెక్కించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా రిపోర్టు‘దంగల్’ కలెక్షన్ రు. 2000 కోట్లు దాటింది. భారతీయ సినిమా చరిత్రలో ఈ స్థాయికి చేరుకున్న చిత్రం లేదు. ఈ మొత్తం 307  మిలియన్ అమెరికన్ డాలర్లతో సమానం.

 

చైనా బాక్స్ ఆఫీస్ వద్ద  53వ  రోజున రు. 2.5 కోట్లు వసూలు చేయడంతో ‘దంగల్’ రెండువేల కోట్ల క్లబ్ లో చేరిందని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ఇక ప్రపంచ వ్యాపితంగా తీసుకుంటే వసూళ్ళలో ఇంగ్లీషేతర సినిమాలలో అయిదవది.

 

  ఇపుడు ‘దంగల్’  ప్రపంచ వసూళ్ల చాంపియన్లయిన అవతార్ , జురాసిక్ వరల్డ్ లను కోట్టాల్సి ఉంది. ఇవి చైనా బాక్సాఫీస్ వద్ద 15, 14 స్థానాలలో ఉన్నాయి. దంగల్ ది 16 వ స్థానం.

 

‘దంగల్’ ఇప్పటికే కెప్టెన్ అమెరికా:అమెరికా సివిల్ వార్, xXx: Return of  Xander  cage, ట్రాన్స్ ఫార్మర్స్ను, డార్క్ అఫ్ ది మూన్, టైటానిక్ 3డి లను  వెనక్కు తోసేసింది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu