పవన్ పలాయనవాది కాదు

Published : Feb 01, 2017, 05:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
పవన్ పలాయనవాది కాదు

సారాంశం

చేనేత రంగ సంక్షోభం మీద  జనసేనానిది పలాయనం వాదం కాదు...

పవన్ కల్యాణ్ మాటలు చాలా పదును గానే కాదు, స్పష్టంగా, లోతుగా ఉంటాయి. కాకపోతే, ఎవరినో సంతృప్తి పరిచేందుకు అన్ని ప్రశ్నలకుతొందరపడి ఒకేసారి సమాధానం చెప్పి, తర్వాత  ఉపసంహరించుకోలేక, మనసులో ఉంచుకోనూ లేక తలకిందులవడం ఆయన తత్వం కాదు.

 

సమయం వచ్చినపుడల్లా దేని మీద క్లారిఫికేషన్ అవసరమో దానిని మాత్రం ఇస్తున్నారు. ఎవరైనా తమ ప్రశ్నలకు సమాధానం రాకపోవడంతో పవన్ వన్నీ గాలిమాటలనుకుంటున్నారా,  ఆయన నిన్న చేనేత కార్మికుల సమావేశం తర్వాత అన్నమాటలనొకసారి  జాగ్రత్తగా విశ్లేషంచుకోండి.

 

చేనేత రంగం వైశిష్ట్యం ఆయనకు తెలుసు. అందుకే,  నేను బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించుకుని దుమ్ముదులుపుకుని పోదలుచుకోలేదు.  (గతంలో బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రులు ప్రకటించిన వాళ్లంతా ఏక్కడున్నారో భూతద్దం వెదికినా కనిపించరు).

 

"నేను చేనేత వస్త్రాలకు ఉత్తుత్తి బ్రాండ్ అంబాసిడర్ నికాదు,చేనేత కార్మికుల అసలు సమస్యకోసం పరిష్కరించేందుకు కృషి చేస్తాను" అని చెప్పారు. బ్రాండ్ అంబాసిడర్ అంటే సేల్స్ పెంచేందుకు పనికొచ్చే వాడే, కాని పవన్   ఆ స్థాయికి కుదించుకుపోకుండా ఆ వృత్తికి జీవంపొసేందుకు కృషిచేస్తానన్నాడు.

 

ఈ పని తానెలా చెయబోతున్నాడో ఆయన ఫిబ్రవరి 20న మంగళగిరిలో జరిగే  చేనేత సత్యాగ్రహం లో ప్రటిస్తారని  చేనేత రంగం ఆశిస్తున్నది. ఆయన  ఈ రంగానికి చెందిన ప్రముఖులతో అపుడే సంప్రదింపులు కూడా జరిపుతున్నారు.  తన చేనేత పునర్వికాసం కార్యకమ్రాన్ని తాను జనసేన మ్యానిఫెస్టోలో కూడా పెడతానన్నారు.

 " ప్రపంచం మారుతూ ఉంది. చేనేత రంగం మారాలి, చేనేత కార్మికులు ఇక ఈ వృ త్తి మానుకుని వేరే బతుకు దెరువు చూసుకోవాలి," అని ముఖ్యమంత్రులు పలాయనం  చిత్తగిస్తున్నారు. 

ఈ రంగం గురించి క్షుణ్ణమయిన అధ్యయనం జరగాలని పవన్  భావిస్తున్నారు.

 

ఈ మూడు ముక్కలు పవనిజం అంటే ఏమిటో చెప్పాయి.

 

ఎందుకంటే, రైతుల తర్వాత సంక్షోభంలో కూరుకుపోయి, బయటపడే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్బడుతున్నవారు  చేనేత కార్మికులే. ఇద్దరు ముఖ్యమంత్రులు  ఈ సమస్యకు పరిష్కారం పలాయన వాదం. సమస్యను పరిష్కరించే మార్గం కనుకొనే నిజాయితీ లేెక, సమస్యలొస్తున్నాయి పారిపోండని సలహా ఇచ్చారు. " ప్రపంచం మారుతూ ఉంది. చేనేత రంగం మారాలి, చేనేత కార్మికులు ఇక ఈ వృ త్తి మానుకుని వేరే బతుకు దెరువు చూసుకోవాలి," అని ఈ ముఖ్యమంత్రులు పలాయనం  చిత్తగించారు.  ఈ ముఖ్యమంత్రులెవరో పేరు చెప్పనవసరం లేదు.

 

పవన్ ఈ ఎస్కేపిస్టు రూట్ తీసుకోలేదు.

 

ఈ సమస్యకు పరిష్కారం వుందని నమ్ముతున్నారు. అందుకే, ఆయన మీరు వేరే పనిచేసుకునిబతకండి అన లేదు.

 

చేనేత వస్త్రాలకు మార్కెట్ ల బాగా గిరాకి ఉంది. దానికి తగ్గట్టు వస్త్రోత్పత్తి రూపాంతరీకరించడం ఒక మార్గం.

 

చేనేత రంగం మాయమంటే మనం సంస్కృతి ఆ మేరకు మాయం. పవన్, ఒక కళాకారుడిగా, దీనికి ఒప్పుకోరు. అనుమానం లేదు. 20వ తేదీదాకా వేచి చూడండి, జనసే మ్యానిఫెస్టో వచ్చే దాకా ఒపిక పట్టండి.







 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !