టీవీ యాంకర్ పై పవన్ ఫ్యాన్స్ దాడి

Published : Mar 26, 2017, 10:08 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
టీవీ యాంకర్ పై పవన్ ఫ్యాన్స్ దాడి

సారాంశం

కాటమరాయుడు సినిమాకు 3 రేటింగ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆగ్రహం

సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు అదే పవన్ కల్యాణ్ కు మాత్రం భక్తులుంటారు అని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతుంటారు.నిజంగా పవన్ ను వాళ్లు హీరోగా కంటే దేవుడుగానే చూస్తుంటారా అనిపిస్తుంది వాళ్ల పోస్టులు కామెంట్లు చూస్తుంటే.

 

ఆ మధ్య అల్లు అర్జున్ ఏదో ఓ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలంటే చెప్పను బ్రదర్ అంటూ కాస్త సీరియస్ అయ్యారు. అంతే ఆ పై పవన్ ఫ్యాన్స్ తమ సత్తా ఏంటో దువ్వాడ జగన్నాథం ట్రైలర్ సమయంలో చూపించారు. ఆ సినిమా ట్రైలర్ ను యూట్యూబ్ లో పోస్టు చేసిన వెంటనే దానికి లైక్స్ కంటే డిస్ లైక్స్ యే రికార్డు స్థాయిలో ఎక్కువగా వచ్చాయి. ఇదంతా పవన్ ఫ్యాన్స్ పనే అని చెప్పాల్సిన అవసరం లేదు.

 

లేటెస్టు గా  పవన్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాకు ఓ టీవీ చానెల్ 3 రేటింగ్ ఇచ్చింది. అది కూడా పవన్ ఫ్యాన్స్ ను డిబేట్ లో కూర్చొబెట్టే ఆ పని చేసింది. ఇంకే ముంది అనుకున్నంతా అయింది. మూడు రేటింగ్ ఎలా ఇస్తారంటూ పవన్ ఫ్యాన్స్ స్టూడియోలోనే గొడవకు దిగారు. అక్కడున్న ఫర్నీచర్ పై అడ్డుకున్న యాంకర్ పై ఇలా తమ ప్రతాపాన్ని చూపారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !