అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం (వీడియో)

First Published Mar 25, 2017, 6:57 AM IST
Highlights

ఎన్నో దేశాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణ మందిరాలను కూడా నిర్మిస్తున్నాయి. కొన్ని దేశాలు దేవాలయాల నిర్మాణానికి స్ధలాలను, నిధులను కూడా కేటాయిస్తూ పరమతసహనాన్ని చాటుకోవటం మంచిదేకదా?

హిందూ ఇతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా ఆధరణ పెరుగుతోంది. అందుకు తాజాగా ఓ ఉదాహరణ నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో హిందూ దేవుళ్ళైన ‘శివ-కృష్ణు’లకు బ్రహ్మాండమైన దేవాలయాలను నిర్మించారు. యుఏఇ చరిత్రలోనే హిందూ దేవాలయం నిర్మించటం ఇదే ప్రధమం. దేవాలయం నిర్మాణానికి యుఏఇ సుల్తాన్ షేక్ మొహ్మద్ బిన్ జయాద్ అల్-నహ్యాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో ఆలయ నిర్మాణం సాధ్యమైంది.  అబుదాబికి సమీపంలోని అల్ వత్భా ప్రాంతంలో 20 వేల చదరపు మీటర్ల స్ధలంలో దేవాలయం నిర్మితమైంది. దేవాలయ నిర్మాణం పట్ల అబుదాబిలోని లక్షలాది మంది హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అబుదాబి ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న పర్యాటక ప్రాంతం. ప్రపంచదేశాల నుండి వర్తక, వ్యాపార ప్రముఖులు, హిందువులు ఎందరో ప్రతీరోజు అబుదాబికి రాకపోకలు సాగిస్తుంటారు. అటువంటి రాజధానిలో ఇపుడు దేవాలయం నిర్మించటమంటే హిందువులకు ఓ గుర్తింపు వచ్చినట్ల్లైందని ఆలయ కో ఆర్డినేటర్ బిఆర్ షెట్టీ వ్యాఖ్యానించారు. పరమతసహనానికి దేవాలయ నిర్మాణం ప్రత్యేక ఉదాహరణగా షెట్టి పేర్కొన్నారు. యుఏఇ సుల్తాన్ మనదేశానికి వచ్చినపుడు తమ దేశంలో దేవాలయ నిర్మాణానికి ప్రత్యేకంగా స్ధలాన్ని కేటాయిస్తానని ప్రదానమంత్రి నరేంద్రమోడికి ఇచ్చిన హామీ మేరకు సుల్తాన్ స్ధలం కేటాయించారు. ఆలయంలో జరిగిన పూజలకు స్వయంగా సుల్తాన్ పాల్గొని హారతులు పట్టటంకన్నా మనకేం కావాలి.

అదేవిధంగా, రామాయణ, మహాభారతాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆధరణ పెరుగుతోంది. అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవచించిన భగవద్గీతను ఇప్పటికే అనేక దేశాలు తమ భాషల్లోకి అనువధించాయి. శ్రీకృష్ణ గీతాసారాంసం ఆధారంగా కృష్ణతత్వానికి బహుళ ప్రచారం కల్పించటం కోసం పాశ్చాత్యదేశాలు ’ఇస్కాన్‘ పేరుతో సంస్ధలను నెలకొల్పిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్నో దేశాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణ మందిరాలను కూడా నిర్మిస్తున్నాయి. కొన్ని దేశాలు దేవాలయాల నిర్మాణానికి స్ధలాలను, నిధులను కూడా కేటాయిస్తూ పరమతసహనాన్ని చాటుకోవటం మంచిదేకదా?

 

 

 

click me!