ప్రణబ్ కు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమౌతున్న పార్లమెంట్

Published : Jul 07, 2017, 04:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ప్రణబ్ కు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమౌతున్న పార్లమెంట్

సారాంశం

పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా వీడ్కోలు చెప్పబోతున్నాయి.ఆయన పదవీ కాలం జూలై 24 ముగుస్తున్నది.  అందువల్ల  జులై 23న పార్లమెంట్   ఉభయసభలు సంయుక్తంగా సమావేశమయి ప్రణబ్‌ దా కు వీడ్కోలు చెబుతాయి.

పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా వీడ్కోలు చెప్పబోతున్నాయి.

 

ఆయన పదవీ కాలం జూలై 24 ముగుస్తున్నది.  అందువల్ల  జులై 23న పార్లమెంట్ ఉభయసభలు సంయుక్తంగా సమావేశమయి ప్రణబ్‌కు వీడ్కోలు చెబుతాయి.

 

ప్రణబ్ సేవలను కొనియాడుతూ ప్రధాని, ప్రతిపక్షనేత, సీనియర్ నేతలు, సభ్యులు ప్రసంగిస్తారు.

 

దీని కోసం భారీగా ఏర్పాట్లు  చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ , ప్రధాని నరేంద్ర మోదీ వేర్వేరు సైద్ధాంతిక నేపథ్యం నుంచి వచ్చినా వారిరువురి మధ్య సఖ్యత కొనసాగింది. తనకుగురువు లాంటి వాడని ప్రణబ్ ముఖర్జీని ప్రధాని చాలా సార్లు కొనియాడారు. వారివురి మధ్య ఉన్న సఖ్యతకు ధీటుగా వీడ్కోలు సభ జరుగుతున్నది.

 

ప్రణబ్ ముఖర్జీ జులై 25, 2012, భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీబాధ్యతలు చేపట్టారు.ఈ  జులై 25న కొత్త అభ్యర్ధి రాష్ట్రపతి  ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు  స్వీకారం.ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రచారం సాగుతూ ఉంది. పోటీలో ఇద్దరు అభ్యర్థులున్నారు. అధికార ఎన్ డిఎ  మాజీ బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ను నిలబెడితే, ప్రతిపక్షాలు అభ్యర్థిగా  మాజీ లోక్ సభ స్పీకర్  మీరా కుమార్ ను ఆయన మీద పోటీ పెట్టాయి. రాష్ట్రపతి పదవికి జూలై17న ఎన్నిక జరగుతుంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !