తన్నీర్ తన్నీర్ : చంద్రబాబుకు పన్నీర్ లేఖ

Published : Jan 07, 2017, 10:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
తన్నీర్ తన్నీర్ : చంద్రబాబుకు పన్నీర్ లేఖ

సారాంశం

కృష్ణా జలాలు  అందితే తప్ప చెన్నై నగరవాసుల దాహం తీరదంటున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్

కృష్ణా జలాలిచ్చి చైన్నై నగరాన్ని అదుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ రోజు లేఖ రాశారు.

 

ఈ శాన్య రుతుపవనాల వల్ల రావలసినంత వర్షం రాకపోవడంతో చెన్నైకి మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లన్ని ఖాళీ అవుతున్నాయని చెబుతూ వెంటనే కృష్ణా జలాలను విడుదల చేసి అదుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు.

 

ఈశాన్య రుతుపనవాల  వర్షపాతం దాదాపు 57 శాతం తక్కువ కురిసిందని పన్నీర్ సెల్వం చెప్పారు.


రానున్న నెలల్లో చెన్నైనగర వాసుల మంచినీటి అవసరాలుతీరాలంటే ఇపుడున్న నీరు చాలదని,  అదనంగా మంచినీరు అవసరమని అన్నారు.

 

‘ అందువల్ల ఈ ఏడాది జులై  దాకా మంచినీటి అందుబాటులో ఉండాలంటే, కందలేరు కృష్ణా నీరే మాకు అధారం. చెన్నై నగర వాసులకు కృష్ణా జలాల తోనే మనుగడ వుంటుంది,’ అని అయన లేఖలో పేర్కొన్నారు.

 

1983 లో కుదిరిన  అంతర్రాష్ట్ర వప్పందం ప్రకారం తమిళనాడు సరిహద్దు దగ్గరికి 12 టిఎంసిల( అవిరైపోయిందికాకుండా) నీటిని కందలేరు రిజర్వాయర్ నుంచి అందించాల్సి వుంటుందని పన్నీర్ సెల్వమ్ చెప్పారు.

 

‘ సాధారణంగా జూలై- అక్టోబర్ ల మధ్య 8 టిఎంసిల నీటిని,  జనవరి నుంచి ఎప్రిల్ మధ్య మరొక నాలుగు టిఎంసిల నీటిని విడుదలచేయాలి. అయితే, అక్టోబర్- డిసెంబర్ మధ్య 0,99 టిఎంసిల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కందలేరు రిజర్వాయర్లో 13.53 టిఎంసిల నీరు అందుబాటులో ఉందని తెలిసింది. చెన్నైని ఆదుకునేందుకు అవసరమయిన నీరు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉందనుకుంటున్నాం. అందువల్ల నీటిని వెంటనే విడుదల చేసి చెన్నై నీటి కటకట తీర్చాలి,’ అని పన్నీర్ సెల్వం కోరారు.



 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !