‘సిబిల్’.... అప్పు మరింత కఠినం

First Published Jan 7, 2017, 4:21 AM IST
Highlights

రూ. 50 వేలకుపైగా రుణాలు కావాలనుకున్న వారి కనీస స్కారు 700 ఉండాల్సిందే.

పెద్ద నోట్ల రద్దు ప్రభావం సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్)పై బాగా ప్రభావం చూపుతోంది. బ్యాంకుల్లో రుణాలు కావాలనుకున్నవారు తమ స్కోరును 700కు తగ్గకుండా చూసుకోవాల్సిందే. ఏప్రిల్ నెల నుండి  సిబిల్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి.

 

ఇప్పటి వరకూ జాతీయ బ్యాంకు మేనేజర్లు తెలిస్తే ఏదోలా మేనేజ్ చేసుకుంటున్నవారికి ఇకనుండి కుదరదు.

 

రూ. 50 వేలకుపైగా రుణాలు కావాలనుకున్న వారి కనీస స్కారు 700 ఉండాల్సిందే. రాబోయే నిబంధనను ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు అమలు చేస్తున్నా, జాతీయ బ్యాంకుల్లో పెద్దగా అమలు కావటం లేదు. ఏప్రిల్ నెల నుండి ఆ బ్యాంకుల్లో కూడా తప్పనిసరి.

 

ఇళ్ళ కొనుగోలు, మరమ్మతులు, వాహన, వ్యక్తిగత, విద్య,ఆస్తి తాకట్టు, రియల్ ఎస్టేట్ తదితర వ్యపార రుణాల కోసం బ్యాంకులకు రోజుకు లక్షల దరఖాస్తులు వస్తుంటాయి.

 

అటువంటి దరఖాస్తులను ఇకనుండి సిబిల్ స్కోరు 700లోపుంటే నేరుగా తిరస్కరిస్తారు. స్కోరు 700-750 మధ్య ఉంటే బాగుంటుంది. అదే స్కోరు 750-850 మధ్య ఉంటే బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. స్కోరు విషయంలో ఖాతాదారు అంతుకుముందు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు, చెల్లింపు తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు.

 

ఈ స్కోరు ఆధారంగానే రోజుకు కొన్ని లక్షల దరఖాస్తులకు రుణాలు ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తసుకుంటాయి బ్యాంకులు. కాబట్టి భవిష్యత్తులో బ్యాంకుల నుండి అప్పు తీసుకోవాలని అనుకుంటున్న వారు తమ స్కోరును ఎట్టి పరిస్ధితిలోనూ 700కు తగ్గకుండా చూసుకోవాలి.

 

నెలకు లక్ష రూపాయల జీతం ఉన్న ఉద్యోగుల దరఖాస్తులను కూడా బ్యాంకులు తిరస్కరిస్తుండటానికి కారణం స్కోరు సరిగా లేకపోవటమే. అంటే బ్యాంకుల్లో రుణాలు కావాలంటే ఆర్ధిక క్రమశిక్షణ ఎంత అవసరమో గమనించండి.

click me!