
సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్తాన్ తోక ముడిపించిన భారత ప్రధాని మోదీకి ఓ పాకిస్తాన్ యాంకర్ నుంచి సీరియస్ వార్నింగ్ వచ్చింది. టీవీలోనే ఆ యాంకరమ్మ మోదీపై కారాలుమిరియాలు నూరింది.
ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారిన ఆ వీడియో చూస్తే ఏ భారతీయుడికైనా కోపం రావాలి కానీ ఏంటో అందరూ ఆ వీడియో చూస్తూ పగలబడి నవ్వుతున్నారు.
భారత్ సర్జికల్ స్టైక్ పై ఆమె ఈ వీడియోలో మోదీకి చాలా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ వైపు పొరపాటున భారత్ విమానాలు, రాకెట్లు వచ్చాయని అసలు భారత్ కు పాకిస్తాన్ ను ఎదుర్కొనే శక్తి లేదని చెప్పింది.
అంతటితో ఆగలేదు... శక్తిమాన్, హనుమంతుడు వచ్చినా భారత్ ను పాక్ నుంచి కాపాడలేరని హెచ్చరించింది. మోదీని తన లిమిట్ లో తాను ఉండాలని సూచించింది.
బాలీవుడ్ స్టైల్ హావభావాలతో ఆ అమ్ముడు ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే నిజంగా హనుమంతుడి ముందు కోతి కుప్పిగంతులు వేసినట్లే కనిపించింది.
అందుకే ఆమె సీరియస్ వార్నింగ్ కు మనవాళ్లు చాలా సీరియస్ గా నవ్వేస్తున్నారు.
కొందరైతే ఆ యాంకరమ్మ బాలీవుడ్ లో నటిస్తే నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని కితాబు కూడా ఇస్తున్నారు.