బ్యాలెట్ కోసం పెరుగుతున్న డిమాండ్లు

First Published Apr 10, 2017, 9:33 AM IST
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలకు మద్దతు పలకటం గమనార్హం. మధ్యప్రదేశ్ లో కొందరు నిపుణులు ఇవిఎంలను హ్యాకింగ్ చేయవచ్చని నిరూపించారు. అంతేకాకుండా పాశ్చాత్యదేశాలన్నీ దాదాపు ఇవిఎంలను నిషేధించాయి.

మనదేశంలో ఏదో ఓ వివాదం నడుస్తూ ఉండాలి. లేకపోతే మనకు మనశ్శాంతిగా ఉండదు. తాజా వివాదమేమిటంటే ఇవిఎంల ట్యాంపరింగ్ గురించి. దేశంలోని చాలా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఎన్నికల్లో బ్యాలెట్ పేపరే వాడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఇవిఎం)ల ద్వారా ఓట్లను హ్యాక్ చేయవచ్చని దేశంలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన తర్వాత ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఎన్నికల్లో ఘెర పరాజయం పొందిన మాయావతి ఇవిఎంలను భాజపా ట్యాంపరింగ్ చేసిందంటూ ఆరోపణలు మొదలుపెట్టారు.

మాయావతి మొదలుపెట్టిన ఆరోపణలు దేశమంతా వ్యాపించింది. తమిళనాడు, ఢిల్లీ, బీహార్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఎక్కువగా బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ జరపాలంటూ డిమాండ్లు చేస్తున్నాయ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలకు మద్దతు పలకటం గమనార్హం. మధ్యప్రదేశ్ లో కొందరు నిపుణులు ఇవిఎంలను హ్యాకింగ్ చేయవచ్చని నిరూపించారు. అంతేకాకుండా పాశ్చాత్యదేశాలన్నీ దాదాపు ఇవిఎంలను నిషేధించాయి.

గతంలో అధికారం కోల్పోయినపుడు చంద్రబాబునాయుడు, అధికారంలోకి రాలేకపోయినపుడు పశ్చిమబెంగాల్ ప్రస్తుత సిఎం మమతా బెనర్జీ తదితరులంతా ఒకపుడు ఇవిఎంల్లో మోసాలు జరుగుతున్నట్లు ఆరోపించన వారే. తర్వాత అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మరచిపోయారు. ఏమో రేపటి ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ ఇవిఎంలపై మళ్ళీ ఆరోపణలు చేసినా ఆశ్చర్యం లేదు. రాజకీయ నేతలు కదా అధికారంలో ఉన్నపుడు ఒకలాగ, ప్రతిపక్షంలో కూర్చున్నపుడు ఒకలాగ  మాట్లాడగలరు. ప్రస్తుతం దేశంలోని ప్రతిపక్షాలన్నీ బ్యాలెట్ పేపర్నే వాడాలంటూ ఎన్నికల సంఘాన్ని చేస్తున్న డిమాండ్ ఏమవుతుందో చూడాలి.

click me!