ఇద్దరికంటే ఎక్కువ సంతానముంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే..

Published : Apr 09, 2017, 02:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఇద్దరికంటే ఎక్కువ సంతానముంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే..

సారాంశం

అసోం ప్రభుత్వ సంచలన నిర్ణయం

దేశంలో సర్కారు నౌకరీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రైవేటు లో ఎంత పెద్ద జాబు చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగికి ఉండే మర్యాదే వేరు. అయితే ఇకపై ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే అసోంలో ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులయ్యే ప్రమాదం ఉంది.

 

ఆ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఉన్నత చదువుల్లో ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా డ్రాఫ్ట్‌ పాపులేషన్‌ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ఇకపై ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారు.

 

ఆడపిల్లలకు యూనివర్సిటీ స్థాయిలో విద్యను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి శర్మ తెలిపారు. ఈ మేరకు తమ ప్రతిపాదనలపై కొత్తగా చట్టం రూపొందించామని, త్వరలో అసెంబ్లీలో ఆమోదించి దీన్ని అమలులోకి తీసుకొస్తామని తెలిపారు. దానికంటే ముందు ఈ అంశంపై ప్రజాభిప్రాయసేకరణ కూడా జరుపుతామని ప్రటకించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !