‘చిన్నమ్మ’ మూడు సార్లు కొట్టడం వల్లేనట...

Published : Apr 10, 2017, 09:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
‘చిన్నమ్మ’ మూడు సార్లు కొట్టడం వల్లేనట...

సారాంశం

మౌంట్ రోడ్డు కుంగిపోవడంపై నెటిజన్ల సెటైర్లు

చెన్నైలోని అన్నాసలై ( మౌంట్) రోడ్డు ఆదివారం కుంగిపోయిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో అటుగా వెళుతున్న  బస్సు, కారు ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో అందులో పడిపోయాయి. 

 

వాహనదారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.

 

అక్కడ అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైలు పనుల కారణంగానే రోడ్డు కుంగిపోయిందని చెన్నై మున్సిపల్ అధికారులు నిర్దారించారు.

 

అయితే నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. రోడ్డు కుంగిపోయిన తర్వాత దానిపై తీవ్రంగా పరిశీలించిన అనంతరం చిన్నమ్మ శశికళ వల్లేమౌంట్ రోడ్డు కుంగిపోయిందని  నిర్ధారించారు.

 

ఆ రోజు అమ్మ సమాధి వద్ద చిన్నమ్మ శపథం చేస్తూ మూడు దెబ్బలు కొట్టడం వల్ల ఆ ఎఫెక్టు తో మౌంట్ రోడ్డు కుంగిపోయిందనిసోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా చూపుతున్నారు.

 

అంతేకాదు ఈ రోడ్డు కుంగిపోవడంలో కోలీవుడ్ లోని చాలా మంది హీరోల హస్తం కూడా ఉందని ఢంకా బజాయించి చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !