అక్షయ తృతీయ ఎఫెక్ట్... ఆన్ లైన్లో కొంటే డిస్కౌంట్స్ అదుర్స్

Published : Apr 28, 2017, 12:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
అక్షయ తృతీయ ఎఫెక్ట్... ఆన్ లైన్లో కొంటే డిస్కౌంట్స్ అదుర్స్

సారాంశం

ఈ  కామర్స్ దిగ్గజాలు రంగంలోకి దిగాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ సంస్థలు ఆన్ లైన్ లో షాపింగ్ చేసిన వారికి భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.

అక్షయ తృతీయ  సెంటిమెంట్ ను  క్యాష్ చేసుకోడానికి బంగారు దుకాణాలు భారీ డిస్కౌంట్స్ కు తెర తీశాయి.హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.

 

అందుకే ఈ రోజు బంగారు దుకాణాలన్నింటిలో సందడి నెలకొంది. ఇదే అదునుగా వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు భారీ డిస్కౌంట్ లు ప్రకటించాయి.

 

అయితే వాటికి పోటీగా ఈ సారి ఈ  కామర్స్ దిగ్గజాలు రంగంలోకి దిగాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ సంస్థలు ఆన్ లైన్ లో షాపింగ్ చేసిన వారికి భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.

 

బంగారం, ప్లాటినం, డైమాండ్ జువెల్లరీలపై ఈ డిస్కౌంట్లు వర్తింపచేయనున్నట్లు ఈ కామర్స్ వెబ్ సైట్లు ప్రకటించి బడా బంగారు షాపులకు నయా సవాలు విసిరాయి.

 

ముఖ్యంగా ఫ్లిప్ కార్డు అయితే తమ ప్లాట్ పామ్ పై గోల్డ్ రింగ్, నెక్లెస్, చైన్, పెండెంట్స్, ఈయరింగ్ వంటి బంగార ఆభరణాలను కొనుగోలు చేస్తే 70 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ అదనంగా 5 శాతం తగ్గింపు ఉంటుందని ప్రకటించింది.

 

ఇక అమెజాన్ కూడా అదే బాటలో డిస్కౌంట్స్ కు సిద్ధమైంది. ఈ ఒక్క రోజే ఈ ఈ ఆఫర్  వర్తిస్తుందని పేర్కొంది. ఏకంగా పేటీఎం అయితే కొన్ని షరతులతో ఒక్క రూపాయికే బంగారాన్ని అమ్ముతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !