ఆ స్కూల్లో యోగి అదిత్య నాథ్ హెయిర్ కట్ తప్పని సరి

First Published Apr 28, 2017, 7:41 AM IST
Highlights

మీరట్ లోని రిషబ్ అకాడమీ కో ఎడ్యకేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ‘ యోగి హెయిర్ కట్’ తప్పనిసరి చేసింది

ఉత్తర ప్రదేశ్ లో ఇపుడంతా ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్  యే.

 

ఇపుడక్కడ యోగి వేష భాషలు చాలా పాపులర్ అవుతున్నాయ్.

 

ఇంతవరకు ఒక్క ప్రధాని మోదీ రోల్ మోడెల్ గా ఉండే వారు. ఇపుడు యోగి తోడయ్యారు.

 

ప్రధాని మోదీ దుస్తులు ఫ్యాషన్ అయితే, యోగి తలకట్టు (హెయిర్ కట్ ) సూపర్ హిట్టయింది.

 

రాష్ట్రంలోని ఒక ప్రయివేటు పాఠ శాల వాళ్లు ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా  యోగిలాగ హెయిర్ కట్ చేయించుకోవాలని ఉత్తర్వులిచ్చారు. మీరట్ లో  సిబిఎస్ సి కి అనుబంధంగా ఉన్న  రిషబ్ అకాడమీ కో ఎడ్యకేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్  యోగి హెయిర్ కట్ తప్పనిసరి చేసింది. స్కూల్ లో ఉన్న 2800 మంది విద్యార్థులకు ఈ యోగీ హెయిర్ కట్ నోటీ సు లిచ్చింది.

 

 గురువారం నాడు తల సరిగా దువ్వుకోలేదని కొంతమంది విద్యార్థులను  కాలేజీవారు లోనికి అనుమతించకపోవడంతో ఈ యోగి హెయిర్ కట్ విషయం బయటపడింది.‘హెయిర్ కట్ ఎలా ఉండాలో మేం చెబుతున్నది అర్థం చేసుకోలేకపోవడంతో విద్యార్థులంతా యోగి హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పాం. సైన్యంలో కూడా ఇలాగే ఉంటుంది. అంతేకాదు,గడ్డం పెంచడానికి వీల్లేదని కూడ చెప్పారు. ఎందుకంటే,  నమాజ్  ప్రార్థనామందిరం కాదు, మదర్సా కాదుగా,’ అని కాలేజీ సెక్రెటరీ రంజిత్ జైన్ చెప్పారు.

 

కోఎడ్యుకేషన్ అని పేరున్నా, లవ్ జిహాద్ ప్రమాదం తప్పించేందుకు ఇపుడు  బాల బాలికలకు విడివిడిగా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇలాంటివాటిని సహించేది లేదు,’అని కూడా ఆయన చెప్పారు.

 

 

click me!