ఈ వాటర్ బాటిల్స్ రేటు 34,109 రూపాయిలు... ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది

First Published Apr 28, 2017, 10:09 AM IST
Highlights

12 బాటిల్స్ ఎందుకు ఒక్కటి చాలు అనుకుంటే జస్ట్ రూ. 2,842 లు కడితే చాలు.. షిప్పింగ్ చార్జీలకు అదనంగా డబ్బులు కట్టడం మరిచిపోవద్దు.

పొరపాటున 34.109 పైసలు అనుకునేరు. కాదండి బాబు... అక్షరాల 34,109 రూపాయిలే.అంత డబ్బు పెడితే వాటర్ బాటిల్ ఏంటీ వాటర్ ప్లాంటే పెట్టొచ్చు కదా అను అనుకుంటున్నారు. అది వేరే సంగతి..

 

ఈ రోజుల్లో 20 రూపాయిల వాటర్ బాటిల్ ను రూ. 40 కి అమ్ముతుంటేనే కోర్టుకు వెళుతున్నాం.కానీ, ఇదేదో ఈవెయిన్ (evain) కంపెనీ అట. మనోళ్ల సంగతి తెలియడం లేదు. తన వాటర్ బాటిల్స్ కు ఏకంగా రూ. 34,109 రేటు ఫిక్స్ చేసి అమ్ముకానికి పెడుతున్నాడు.

 

అంత రేటు ఫిక్స్ చేశారంటే ఏన్ని సద్గుణాలు ఆ నీటిలో ఉంటాయో అని అనుకుంటున్నారా... వారైతే తమ వాటర్ చాలా సహజసిద్ధమైనదని, ప్రతి చుక్క ఫిల్టర్ చేసిందని క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాటర్ బాటిల్ కూడా తాగడానికి చాలా అనువుగా రూపొందించినట్లు చెబుతున్నారు.మీకు వారు చెబుతున్నవి నచ్చితే అక్షరాల రూ. 34, 109 లు పెట్టి వారి జలంతో పునీతం కావొచ్చు.

 

అయితే అంత మొత్తం ఒకేసారి చెల్లించే స్థాయి మీకు లేదని, ఆ వాటర్ ను రుచి చూసే అదృష్టం రావడం లేదు అని బాధ పడకండి. కంపెనీవారు దయతో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చారు.నెల నెలా కొంత చేతి చమురు వదిలించుకొని ఈ వాటర్ బాటిల్స్ ను కొనుక్కోవచ్చు.

హోం డెలివరీ సౌకర్యం కూడా ఉందండోయ్. రూ. 34,109 తో పాటు షిప్పింగ్ చార్జీల కింద మరో రూ.90 లు చెల్లిస్తే 12 బాటిల్స్ తో ప్యాక్ చేసిన ఈ జల‘సిరి’ సరాసరి మీ స్వగృహానికి వచ్చిపడుతుంది.

 

12 బాటిల్స్ ఎందుకు ఒక్కటి చాలు అనుకుంటే జస్ట్ రూ. 2,842 లు కడితే చాలు.. షిప్పింగ్ చార్జీలకు అదనంగా డబ్బులు కట్టడం మరిచిపోవద్దు.

 

అన్నట్లు ఆ మధ్య దీపా మెహతా అనే బాలీవుడ్ డైరెక్టర్ ‘వాటర్’ అనే సినిమా తీశారు గుర్తుందా. దానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా.. రూ. 34, 109 కంటే చాలా తక్కువ.

click me!