జగన్ ఫ్లెక్సీలకు అధికారుల అభ్యంతరం

Published : Nov 03, 2017, 04:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
జగన్ ఫ్లెక్సీలకు అధికారుల అభ్యంతరం

సారాంశం

తిరుపతి మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీలు లేదని మున్సిపల్ అధికారుల ఆదేశాలు

తిరుపతి మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం సాయంత్రం వైసీపీ అధినేత జగన్.. తిరుమల వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తిరుమల చేరుకొని.. రేపు ఉదయం ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

కాగా.. తమ ప్రియతమ నేత తిరుమలకు వస్తున్నారనే సంతోషంతో.. వైసీపీ నేతలు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేద్దామనుకున్నారు. అయితే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీలు లేదని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల తీరుపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలు అనుమతించి.. తమ అధినేత ఫ్లెక్సీలు మాత్రం ఎందుకు అనుమతించరంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఈ విషయంలో మున్సిపల్  అధికారులకు, వైసీపీ నేతలకు వాగ్వివాదం చోటుచేసుకుంది. వివాదం కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !