చంద్రబాబు కాన్వాయికి అన్ని కోట్లా..?

First Published Nov 3, 2017, 3:39 PM IST
Highlights
  • మరోసారి పెంచనున్న చంద్రబాబు కాన్వాయి
  • చంద్రబాబు కాన్వాయి కోసం రూ.5.65కోట్లు విడుదల చేసిన  ప్రభుత్వం
  • ఇప్పటికి ఇది మూడోసారి కావడం గమనార్హం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  కాన్వాయిని మరోసారి పెంచుతున్నారు. ఆయన కాన్వాయి పెంపు కోసం రూ.5.65 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీవో జారీ విడుదలయ్యింది. ముఖ్యమంత్రికి భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇంటిలిజెన్స్‌ అధికారులు అధునాతన వాహనాల కొనుగోలును ప్రతిపాదించారు. సీఎం భద్రత కోసం కాన్వాయి పెంచడం సబబే. కానీ.. ఎన్ని సార్లు పెంచుతారనేదే ఇప్పుడు ప్రశ్న.

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వాహన శ్రేణిని పెంచడం ఇది రెండోసారి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి టాటా సఫారీ వాహనశ్రేణిని వినియోగిస్తున్నారు. సౌకర్యవంతంగా ఉండటంతో దాన్నే వాడుతున్నారు.

ముఖ్యమంత్రిగా ఉండవల్లికి నివాసం మార్చిన కొత్తలో సుమారు రూ.10 కోట్లతో టయోటా ఫార్చ్యునర్‌ వాహనశ్రేణిని కొనుగోలు చేశారు. వాటిల్లో అధునాతన సదుపాయాలున్నాయని అప్పట్లో పేర్కొన్నారు.  కొద్ది రోజులు ఆ వాహనాలు వాడిన చంద్రబాబు.. తర్వాత... తిరిగి మళ్లీ  టాటా సఫారీ వాహనశ్రేణినే కొనసాగించారు. టయోటా వాహనాల శ్రేణిని పోలీసుల భద్రతలో ఉంచేశారు. హైదరాబాద్‌, డిల్లీ వెళ్లిన సమయంలో టయోటా వాహనశ్రేణిని వినియోగిస్తున్నారు.

అంతేకాకుండా.. సీఎం కోసం ప్రత్యేకంగా బస్సును కూడా గతంలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ బస్సు కోసం దాదాపు రూ.6కోట్లు ఖర్చు చేశారు. తాజాగా మరోసారి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసే నాటికి ఇంకెన్ని వాహనాలు కొనుగోలు చేస్తారో..!

click me!