కృష్ణా జిల్లాలో కుక్క మాంసం అమ్మింది నిజమే

First Published Nov 13, 2017, 4:14 PM IST
Highlights

మందుబాబులకు మాత్రమే విక్రయించినట్లు సమాచారం

కృష్ణాజిల్లా మైలవరం, జి.కొండూరులలో  కొంతమంది అడవి జంతువుల మాంసం పేరుతో కుక్క మాంసం విక్రయించింది నిజమేనని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చాలా తెలివిగా కుక్క మాంసాన్ని విక్రయించారు. వాళ్లు మత్తులో ఉండే మందుబాబులను బురిడీ కొట్టించారు. ఈ విషయం పుడ్ సెఫ్టీ అధికారులు దర్యాప్తులో తేలింది. కాబట్టి మందుషాపుల ముందు నాన్ వెజ్ మంచింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే నని విజయవాడ సంఘటనలు చెబుతున్నాయి.

 రెండు రోజుల క్రితం జిల్లాలో మాంసప్రియులను బెంబేలెత్తిస్తూ మేక,అడవి జంతువుల ముసుగులో కుక్కమాంసం అమ్మకం అమ్మినట్లు  మీడియా లో వరుస కధనాలు రావడంతో అధికారులు ఈ రోజు మైలవరం లో పలు హోటళ్ళు,రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.

ఆహార పదార్థాలు మరియు వాటిలో కలిపే ఇతరములు,రంగుల శాంపిల్స్ సేకరించారు.అనంతరం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ మీడియాలో కధనాలు మేరకు పలు చోట్ల ఆయా ప్రాంతాల పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించామని,60శాతం హోటళ్ళు తనిఖీ పూర్తయిందని అన్నారు. కుక్క మాంస విక్రయం జరిగిందని  ఆయన ధృవీకరించారు.

కుక్క మాంసాన్ని  హోటళ్ళలో  విక్రయించకుండా వైన్ షాపులు వద్ద మందు బాబులకు అమ్మినట్లు అరెస్టయిన వారు తెలిపారన్నారు‌.కాగా హోటళ్ల లోని మాంసం విషయంలో తేడాలేమీ లేవని,ప్రజలు భయపడాల్సిన పని లేదని అన్నారు.ఒక వేళ ఏదైనా తేడాని గుర్తిస్తే ఫుడ్ సేఫ్టీ లేదా సంబంధిత పోలీస్ అధికారులకు పిర్యాదు చేయవచ్చని అటువంటి వాటిపై చర్యలు మాత్రమే కాదు హోటళ్ళు సీజ్ చేయడం జరుగుతుందని మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. 

తనిఖీలు చేసిన కొన్ని హోటళ్ళలో పరిశుభ్రత సరిగా లేదని,అలాగే ఫుడ్ లైసెన్స్ లు లేకుండా కూడా హోటళ్ళు నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.హోటళ్ళలో ఉపయోగించే  ఇతర ఆహార పదార్థాలు నాణ్యత సరిగా లేదని అభిప్రాయపడ్డారు.

ఆహార పదార్థాలు శేఖరించి తనిఖీ కి పంపుతున్నామని నివేదికల్లో తేడాలు గుర్తిస్తే సంబంధిత హోటళ్ళు పై క్రిమినల్ కేసులు పెట్టి హోటళ్ళు సీజ్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

click me!