డ్యూయల్ కెమేరాతో మోటో ఎక్స్ 4

Published : Nov 13, 2017, 04:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
డ్యూయల్ కెమేరాతో మోటో ఎక్స్ 4

సారాంశం

భారత మార్కెట్ లోకి మోటో ఎక్స్ 4 డ్యూయల్ రేర్ కెమేరాతో మోటో ఎక్స్ 4

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మోటోరొలా భారత మార్కెట్ లోకి మరో ఫోన్ ని ప్రవేశపెట్టింది.  మోటో ఎక్స్ 4 పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ ఫోన్ లో డ్యూయల్ రేర్ కెమేరా సదుపాయం ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20,999గా నిర్ణయించారు.

ఫ్లిప్ కార్ట్ లో మీ పాత స్మార్ట్ ఫోన్ ని ఎక్స్ చేంజ్ చేసి ఈ మోటో ఎక్స్ 4ని కొనుగోలు చేసుకోవచ్చు.  తద్వారా రూ.2,500 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఒక వేళ పాత మోటో స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే.. రూ.3000 వేలు వరకు డిస్కౌంట్ పొందొచ్చు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ విధానంలో కూడా చెల్లించవచ్చు.

మోటో ఎక్స్ 4 ఫీచర్లు..

5.20 అంగుళాల తాకే తెర

2.2హెచ్ జీ ఆక్టా కోర్ ప్రాసెసర్

16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా

12మెగా పిక్సెల్ రేర్ కెమేరా

3జీబీ ర్యామ్

ఆండ్రాయిడ్ 7.1.1 నగ్గెట్ ఆపరేటింగ్ సిస్టమ్

3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !