ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణకు 6 నెలల జైలు శిక్ష

First Published Sep 7, 2017, 8:49 AM IST
Highlights

చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు తీర్పు

 

హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు చెల్లని చెక్కు కేసులో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి జయకృష్ణకు ఆరునెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాదు,రు. 25 లక్షల పెనాల్టీ కూడా విధించింది. జరిమానా కట్టలేకపోతే,మరొక నెల జైలు శిక్ష అదనంగా అనుభవించాల్సి ఉంటుంది. అయితే,  ఈ శిక్షతక్షణం అమలు లోకి రాలేదు. ఎందుకంటే, జయకృష్ణ న్యాయవాది అభ్యర్థన మేరకు శిక్షను అక్టోబర్ 5 దాకా వాయిదా వేశారు.  ఈ మధ్య కాలంలో రు. 10 వేలు ష్యూరిటీ కట్టి ఈ శిక్ష మీద ఆయన పైకోర్టులో అప్పీలు వెళ్లవచ్చు.

శిక్ష ఎందుకు పడిందంటే, జిఎస్ నర్శింగా రావు అనే వ్యక్తి జయకృష్ణ రెండు చెక్కులిచ్చారు.  అవి చెల్ల లేదు. దీనితో నర్సింగారావు కేసువేశారు. నర్శింగారావు హైదరాబాద్ అబిడ్స్ లోని రామకృష్ణ ధియోటర్ లో  పార్కింగ్ ప్లేస్ ను లీజు తీసుకున్నాడు. గత 30 ఏళ్లులా లీజు ఆయన పేరు మీదే ఉంది. అయితే, ఈ మధ్య ఈ స్థలంలో మల్లిప్లెక్స్ కట్టాలనే పేరుతో లీజ్ లను రద్దు చేశారు. అపుడు నర్సింగరావు దగ్గిర నుంచి తీసుకున్న లీజు సెక్యూరిటీ డిపాజిట్ ను జయకృష్ణ వాపసు చేయాలి. వాపసు పేరుతో ఇచ్చిన చెక్కులు(ఒకటి 19 లక్షలకు, మరొకటి 8 లక్షలకు)బౌన్స్ అయ్యాయి. దీనితోజయకృష్ణ మీద ఆయన కేసు వేశారు. దీనిమీదే ఎర్రమంజిల్ కోర్టు స్పెషల్ మెజిస్ట్రేట్ కె రవీంద్ర సింగ్ ఈ తీర్పు ఇచ్చారు.

 

 

 

click me!