సరికొత్త రికార్డు నెలకొల్పిన టీం ఇండియా

First Published Sep 6, 2017, 11:30 PM IST
Highlights
  • శ్రీలంకతో ఆడిన టెస్టు, వన్డే, టీ20 సీరీస్ లు గెలిచిన భారత్.
  • లంక, భారత్ మధ్య జరిగిన ఏకైక టీ20లో భారత్ విజయం.
  • కెప్టెన్ కోహ్లీ 82 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

శ్రీలంక టూర్ లో ఇండియా ఆడిన అన్ని మ్యాచ్‌ల‌ విజయాల‌తో నూతన రికార్డును నెలకొల్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీలంక‌లో ఆడిన అన్ని టెస్టు, వ‌న్డే, టీ20 మ్యాచ్ లు గెల‌వ‌డం ఇదే మొద‌టి సారి. బుధవారం ఆడిన ఏకైన టీ20లో కూడా భార‌త్ విజ‌యం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహరంతో ఇండియ గెలుపొందింది. భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక‌ జట్టు నిర్దేశించిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో మూడు వికెట్ల న‌ష్ట‌పోయి చేధించింది.  భార‌త ఓపెన‌ర్లు రోహిత్ శర్మ 9, రాహుల్ 24 త్వ‌ర‌గానే అవుట్ అయ్యారు. త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన‌ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొన‌సాగించాడు. 54 బంతులాడిన కోహ్లీ 7 ఫోర్లు, ఒక సిక్స్ తో 82 ప‌రుగులు చేశాడు. విరాట్ కు మ‌నీష్ పాండే క‌లిశాడు. ఇరువురు జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించారు. 

Handshakes all around as #TeamIndia beat Sri Lanka by 7 wickets in the one-off T20I #SLvIND pic.twitter.com/gAp4xODQWs

— BCCI (@BCCI) 6 September 2017

అంతకుముందు టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లు ఆడి ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్‌కు 3, కుల్‌దీప్ యాదవ్‌కు 2 వికెట్లు తీశారు. బుమ్రా, భువనేశ్వర్‌కు చెరో వికెట్ దక్కింది. అద్బుతంగా రాణించిన విరాట్ కోహ్లీ కి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ వచ్చింది. భారత్ ఇప్పటికే శ్రీలంకపై టెస్ట్ సిరీస్‌ను, వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. 

 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి..

 

click me!