ఉగ్రవాదులు దాన్ని వదల్లేదు

Published : Jan 01, 2017, 11:49 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఉగ్రవాదులు దాన్ని వదల్లేదు

సారాంశం

ఎన్ఎస్ జీ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన పాక్ ఉగ్రమూకలు

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతన్న వేళ భారత్ పై పాక్ ఉగ్రమూక మరో దాడికి దిగింది. ఉగ్రవాద నిర్మూలనలోనూ, దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్ర వహిస్తున్న ఎన్ ఎస్ జీ ( నేషనల్ సెక్యూరిటీ గార్డ్) వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది.

 

ఈ రోజు ఎన్‌ఎస్‌జీ వెబ్సైట్‌ను క్లిక్ చేసిన వారు షాక్ కు గురయ్యారు. వెబ్ సైట్ హోం పేజీలో ఎన్ ఎస్ జీ సమాచారం లేకుండా ఓ అభ్యంతరకర సందేశం కనిపించింది.
కశ్మీర్‌లో ప్రభుత్వ, సైనిక హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అభ్యంతరకర రాతలు రాశారు. కశ్మీర్ లో భారత బలకాలు ముస్లింలపై దాడి చేస్తున్నట్లు ఉన్న ఫొటోలను హోం పేజీలో పెట్టారు.


విషయం గమనించిన అధికారులు వెంటనే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. జాతీయ భద్రతను పర్యవేక్షించే వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  కాగా,  హ్యాకింగ్‌కు పాల్పడినది తామేనని ‘అలోన్‌ ఇంజెక్టర్‌’ అనే సంస్థ ప్రకటించుకుంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !