‘ఆమె’ బాధ.. ఈ మాతృభూమి అర్థం చేసుకుంది

Published : Jul 21, 2017, 01:02 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
‘ఆమె’ బాధ.. ఈ మాతృభూమి అర్థం చేసుకుంది

సారాంశం

మహిళా ఉద్యోగినిలకు నెలసరి సెలవులు ప్రకటించిన కేరళలోని వార్తా ఛానెల్ సంవత్సరానికి అదనంగా 12 సెలవులు

కేరళలోని  ప్రముఖ వార్తా ఛానెల్ మాతృభూమి మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవులు ప్రకటించింది. మహిళలు నెలసరి సమయంలో
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని.. అందుకోసమే నెలసరి సమయంలో మొదటి రోజు సెలవు ఇవ్వాలని తాము నిర్ణయించామని , వీటిని
ఇతర సెలవుల్లో కలపమని సంస్థ జాయింట్ ఎండి ఎంవి శ్రేమ్యమ్స్ కుమార్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే అమలులో పెట్టారు. దీంతో
మహిళా ఉద్యోగులు అదనంగా సంవత్సరానికి 12 సెలవులు పొందుతారని ఆయన తెలియజేశారు. డెస్కు, రిపోర్టింగ్ విభాగాల్లో పనిచేస్తున్న
50మంది మహిళా ఉద్యోగులు లబ్ధి పొందుతారన్నారు. ఇటీవల ముంబయికు చెందిన మీడియా సంస్థ ‘కల్చర్ మెషీన్’ కూడా ఇటువంటి
నిర్ణయమే తీసుకుంది. ఉద్యోగినులకు ‘పిరియడ్ సెలవు’ను మంజూరు  చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !